close
Choose your channels

మా వాడి జాతకానికి ముహూర్తం కుదరడం లేదు .. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ వాయిదా

Wednesday, March 2, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం.. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారాయన. మార్చి 4న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

ఈ పోస్ట్‌పోన్ విషయాన్ని వెరైటీగా చెబుతూ.. ప్రకటన విడుదల చేసింది. ‘‘అల్లం అర్జున్‌కుమార్‌ జాతక రీత్యా మార్చి 4వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఇట్లు అల్లం వారి పెళ్లిబృందం’’ అని అందులో పేర్కొంది.

30 ఏళ్లు వచ్చినా... పెళ్లికాకపోవడంతో ఓ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అతనికి చివరికి పెళ్లి ఎలా కుదిరింది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాకు 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందిస్తుండగా.. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.