చివరి సాంగ్ రికార్డింగ్ లో 'విశ్వరూపం-2'

  • IndiaGlitz, [Wednesday,May 24 2017]

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'విశ్వ‌రూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుద‌ల్లో మాత్రం కొన్ని కార‌ణాల కార‌ణంగా జాప్యం జ‌రుగ‌తూ వ‌చ్చింది. ఈలోపు క‌మ‌ల్‌హాస‌న్‌ ఉత్త‌మ‌విల‌న్‌, చీక‌టి రాజ్యం సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు శ‌భాష్ నాయుడు కూడా సెట్స్‌పై ఉంది. ఇప్పుడో అప్పుడో అంటూ ఊరిస్తున్న‌విశ్వ‌రూపం 2 చిత్రాన్ని చిత్రానికి ఉన్న అర్ధిక స‌మ‌స్య‌ల‌న్నీ పూర్తైయ్యాయి.

మిగిలి ఉన్న పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం2ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి శ‌ర‌వేగంగా ప‌నిచేస్తున్నారు. రీసెంట్‌గా సినిమాకు సంబంధించిన చివ‌రి సాంగ్ రికార్డింగ్‌ను పూర్తి చేశారు. హిందీ, త‌మిళంలో సాంగ్ రికార్డింగ్ పూర్త‌య్యింద‌ని, తెలుగులో ఈ సాంగ్ రికార్డింగ్ చేయాల్సి ఉంద‌ని క‌మ‌ల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

More News

తమిళ్ సినిమా చేయనున్న రాజశేఖర్

ఆహుతి, అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్ క్యారెక్టర్స్తో మెప్పించిన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ ఇప్పుడు పిఎస్వి గరుడ వేగ 125.18 సినిమాలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనపడుతున్నాడు.

చలపతిరావు, యాంకర్ రవిలపై కేసు నమోదు

చలపతిరావు నోటి దూలతో చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అంత ఈజీగా వదలేలా కనపడటం లేదు. చలపతిరావు మహిళలపై చేసి అసభ్యకర వ్యాఖ్యలపై, ఆయన్ను బలపరిచిన యాంకర్ రవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బండ్లగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనాకుమారి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.

జేమ్స్ బాండ్ రోజర్ మూర్ కన్నుమూత

బాండ్..జేమ్స్ బాండ్ అంటూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హాలీవుడ్ కథనాయకుడు రోజర్మూర్(89) కన్నుమూశారు. గత కొంత కాలంగా రోజర్ మూర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు.

'మామ్' తో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్స.

ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదంట...

ఇప్పటి తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పరంగా ఏదైనా ఒకసారి చూస్తే పట్టేస్తాడని అతనితో పనిచేసిన దర్శకులు అంటుంటారు. ఇప్పుడు జై లవకుశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.