close
Choose your channels

ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

Tuesday, May 21, 2019 • తెలుగు Comments

ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను, న‌టి ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవింతో పోల్చుతూ ఎవ‌రో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వివేక్ చ‌ర్య‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్టారు. ట్రోలింగ్స్ కూడా జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కు ఈ ట్వీట్‌పై వివేక్ ఒబెరాయ్ స్పందించారు.

మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ట్వీట్‌ను డిలీజ్ చేశాడు. "నేను ద‌శాబ్ద‌కాలంగా మ‌హిళా సాధికార‌త గురించి ప‌నిచేస్తున్నాను. ఏ మ‌హిళ‌తోనూ అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించ‌లేదు. కానీ నా చ‌ర్య వ‌ల్ల వారు బాధ‌ప‌డుతున్నారు. కాబ‌ట్టి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. ట్వీట్ డిలీట్ చేస్తున్నాను" అని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు వివేక్ ఒబెరాయ్‌. 

Get Breaking News Alerts From IndiaGlitz