'వివేకం' రికార్డ్

  • IndiaGlitz, [Wednesday,July 26 2017]

త‌మిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్ట‌ర్ శివ‌తో వ‌రుస‌గా చేస్తున్న నాలుగో సినిమా 'వివేకం'.ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆరంభం, వీరం, వేదాళం వంటి వ‌రుస హిట్స్ త‌ర్వాత అజిత్ చేస్తున్న సినిమా ఇది. శివ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్‌లో ఎక్కువ లైక్‌లు సంపాదించుకున్న టీజ‌ర్‌కు నేష‌న‌ల్ వైడ్ వివేకం(త‌మిళంలో వివేగం) రావ‌డం విశేషం.

దాదాపు ఐదు ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్‌తో రావ‌డం చూస్తుంటే సినిమాపై ఎంత‌టి భారీ అంచ‌నాలున్నాయో అర్థ‌మ‌వుతుంది. సినిమాను తెలుగు, త‌మిళంలో ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగులో వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'సువర్ణ సుందరి'

హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలకు ప్రస్తుతం ఆదరణ బాగా వుంటున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు

రిక్షా తొక్కిన రకుల్...

రకుల్ హీరోయిన్ కదా..ఆమె రిక్షా తొక్కడమేంటని అనుకుంటున్నారా?

దర్శకుడు సెన్సార్ పూర్తి...ఆగస్టు 4న విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు

కథలో రాజకుమారి సెన్సార్ పూర్తి, ఆగష్టు 25 విడుదల

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ,ప్రేమకధా చిత్రం 'కధలో రాజకుమారి'.

ఇక సినిమాలు చాలు అని అనుకున్నప్పుడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తా - సాయిపల్లవి

వరుణ్తేజ్,సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం `ఫిదా`. జూలై 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తెలంగాణ అమ్మాయి భానుమతి పాత్రలో సాయిపల్లవి నటన అందరినీ అలరిస్తుంది.