కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో ముగిసింది. కాగా.. పోలింగ్ ముగిసిన రాష్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హోరాహోరీగా బైడెన్, ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. తొలి ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 119, ట్రంప్‌కు 92 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి. ఇండియానా, ఓక్లాహామా, టెన్సాసీ, కెంటకీలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.

కాగా.. డీసీ, వెర్మాంట్, మాసాచుసెట్స్, డెలవెర్, న్యూజెర్సీ, మేరీలాండ్‌లో బైడన్ విజయం సాధించారు. సౌత్ కరోలైనా, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ విజయం సాధించగా.. న్యూహ్యాంప్‌షైర్‌లో బైడన్ ముందంజలో ఉన్నారు. ఫ్లోరిడా, జార్జియాలో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌తో సమానంగా బైడన్ దూసుకువస్తుండటం విశేషం. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్‌కు 50.2 శాతం, బైడెన్‌కు 49.7 శాతం ఓట్లు లభించాయి.

కాగా.. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ముందస్తుగా దాదాపు 10 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించేవారికి అధ్యక్ష పదవి లభించనుంది. విజేతను నిర్ణయించండంలో స్వింగ్ రాష్ట్రాల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం.

More News

ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌కు భారీ జరిమానా.. ఈడీ చరిత్రలోనే తొలిసారిగా..

భారత ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలో కనీ వినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది.

రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్ చిత్రం ప్రారంభం

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.

20 ఏళ్లప్పుడే పెళ్లి గురించి ఒత్తిడి చేశారు: అనుష్క

స్టార్ హీరోయిన్ అనుష్క ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే చాలు.. ఆ ఇంటర్వ్యూలో తప్పని సరిగా వివాహానికి సంబంధించిన ఒక ప్రశ్న ఉండి తీరుతుంది.

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్..

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ఎన్నికల కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో

నోయెల్ రీఎంట్రీ.. షాక్ ఇస్తున్న వీడియో..

‘బిగ్‌బాస్’ ఏదైనా జరగొచ్చు అని ఎప్పుడో చెప్పేశారు. ఇక అంతా అయిపోయింది. సింగర్ నోయెల్‌కు సెండాఫ్ కూడా ఇచ్చేశారు.