'మెగా 150 గేమ్' ను విడుదల చేసిన వి.వి.వినాయక్, దిల్ రాజు

  • IndiaGlitz, [Monday,February 06 2017]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంద‌ర్భంలో మెగాభిమానులు ఎం యాప్ సోర్స్ డెవ‌ల‌ప్ మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన స‌తీష్ బాబు ముత్యాల‌, ప్ర‌సాద్ బొలిశెట్టి, పవ‌న్ కొర్ల‌పాటి, శేషు లొశెట్టి 'మెగా 150' గేమ్‌ను ప్లాన్ చేశారు. చిరంజీవి న‌టించిన 150 సినిమాల‌తో ఈ గేమ్‌ను త‌యారు చేశారు. 14 లెవ‌ల్స్‌లో ఉండే ఈ మొత్తం గేమ్‌ను రెండు వాల్యూమ్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. మొద‌టి వాల్యూమ్‌లో 110 సినిమాల‌తో గేమ్ ఉంటే, రెండో వాల్యూమ్‌లో 40 సినిమాలతో గేమ్‌ను రూప క‌ల్ప‌న చేశారు.
వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ''మెగాభిమానుంలంద‌రూ క‌లిసి చేసిన మెగా 150 గేమ్ సూప‌ర్ సక్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. మంచి క్వాలిటీతో రూపొందిన ఈ గేమ్‌ను పిల్ల‌లంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవిగారిపై అభిమానంతో ఆయ‌న అభిమానులంద‌రూ క‌లిసి చేసిన ఈ మెగా 150 గేమ్ పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ గేమ్‌ను త‌యారు చేసిన అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.
ఎం యాప్ సోర్స్ డెవ‌ల‌ప్ మెంట్ ప్ర‌తినిధులు స‌తీష్ బాబు ముత్యాల‌, ప్ర‌సాద్ బొలిశెట్టి, పవ‌న్ కొర్ల‌పాటి, శేషు లొశెట్టి మాట్లాడుతూ - ''చిన్న‌ప్ప‌ట్నుంచి మెగాస్టార్ చిరంజీవిగారి సినిమాలు చూస్తూ ఆయ‌న‌ను అభిమానిస్తూ పెరిగాం. కొత్త‌గా కంపెనీ స్టార్ట్ చేసిన‌ప్పుడు చిరంజీవిగారిపై ఇలాంటి గేమ్ చేయాల‌ని ప్లాన్ చేశాం. చిరంజీవిగారి 150 సినిమాల్లో ప్ర‌తి ఒక సినిమాను అంద‌రికీ తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో గేమ్ ప్లాన్ చేశాం. 14 లెవ‌ల్స్‌గా 150 సినిమాల‌ను దృశ్య రూప‌కంలోకి తీసుకొచ్చాం. చిరంజీవిగారి 110 సినిమాల‌ను ఒక వాల్యూమ్ క్రింద‌, మిగిలిన 40 సినిమాల‌ను మ‌రో వాల్యూమ్ క్రింద క్రియేట్ చేశాం. ఈ గేమ్ అంద‌రికీ నచ్చుతుంద‌ని భావిస్తున్నాం'' అన్నారు.

More News

మణిరత్నం ప్రేమికుల రోజు గిఫ్ట్...

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాతగా

రవితేజ, అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్ ' ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా,ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పటాస్,సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో

రవితేజ స్థానంలో గోపీచంద్....

మాస్ మహారాజా రవితేజ గతేడాది చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే టైటిల్ ఉన్న సినిమా చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి.

సారీ చెప్పి సర్దుకున్న నితిన్....

అఆ సక్సెస్ తర్వాత హీరో నితిన్ ఇప్పుడు హను రాఘవ పూడి సినిమా చేస్తున్నాడు.

'కబాలి' ఫైట్ మాస్టర్స్ డైరక్షన్ లో సందీప్ కిషన్ యాక్షన్

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా,కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'