'ఏంజెల్ ' టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్

  • IndiaGlitz, [Thursday,April 20 2017]

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో యంగ్ హీరో నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ఏంజెల్. దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఓ అద్భుతమైన సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు.

అనంతరం వినాయక్ మాట్లాడుతూ, సింధూరపువ్వ కృష్ణారెడ్డి గారితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఏంజెల్ కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమాకి మొదటి నుంచి తన సహాయ సహాకారులు అందిస్తున్నట్లుగా తెలిపారు. కథ విన్న వెంటనే తనకి చాలా ఆశక్తిగా అనిపించి కృష్ణారెడ్డిగారిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. అలానే హీరో నాగా అన్వేష్ చిన్నప్పటి నుంచి నటన పైనే ధ్యాస పెడుతూ చిత్ర సీమలో ఒక్కో మొట్టు పైకి ఎక్కుతున్నాడని, ఈ సినిమా కచ్ఛితంగా అన్వేష్ కెరీర్ ని ఓ కీలక మలుపు తిప్పుతొందని అన్నారు. ఇక వినాయక్ తో పాటు ఈ కార్యక్రమంలో ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్, సింధూరపువ్వు కృష్ణరెడ్డి, సప్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

More News

'సాయి..నీ...లీలలు' ప్రారంభం

దేవుళ్ల పాత్రల్లో ఒదిగిపోయే నటులు విజయ్ చందర్.ఇప్పటివరకూ ఎన్నో భక్తి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

ఆత్మ పాత్రలో సమంత...

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాబోయే మామ అక్కినేని నాగార్జునతో కలిసి `రాజుగారి గది2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ 'సాహో' ఫస్ట్ లుక్ రిలీజ్ క్యాన్సిలా...

యంగ్ రెబల్ స్టార్ `బాహుబలి 2` ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ తన తదుపరి సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి రిక్వెస్ట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలిలో రెండో భాగం `బాహుబలి 2` విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 28న విడుదలవుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ వల్ల ఇప్పుడు కర్ణాటకలో బాహుబలి 2 విడుదలకు సమస్య క్రియేట్ అయ్యింది.

జమున పాత్రలో అనుష్క

మహానటి సావిత్రి సినీ జీవితాన్ని ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగఅశ్విన్ `మహానటి` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.