రైతు పాత్రలో వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
రెడీ.. యాక్షన్.. కట్ అంటూ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు వి.వి.వినాయక్. అయితే తర్వలోనే ఈయన రెడీ..యాక్షన్.. కట్ చెప్పించుకోనున్నారు. అంటే ఈయన హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన నరసింహ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం వినాయక్ మేకోవర్ అవుతున్నారు. అందులో భాగంగా హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు. అలాగే బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 9 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. 1940 కాలం నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇందులో వినాయక్ రైతు పాత్రలో కనపడబోతున్నారు. మరి ఇందులో హీరోయిన్ ఎవరు? ఇతర పాత్రల్లో ఎవరు నటిస్తారు? సాంకేతిక నిపుణులు ఎవరు? అనే సంగతులు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
దర్శకత్వం కూడా...
ఒకవైపు నటనతో పాటు దర్శకత్వం చేయాలని కూడా వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నాడట. సినీ వర్గాల సమాచారం మేర.. హీరో రామ్‌తో సినిమా చేయాలని వినాయక్ ప్రయత్నం చేస్తున్నాడని టాక్. మరి నటుడిగా వినాయక్ ఏ మేరకు కంటిన్యూ అవుతాడో తెలియదు కానీ.. దర్శకత్వం వైపు మాత్రం ఆసక్తిని చూపుతున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.