‘ఆర్ఆర్ఆర్’.. ఆలియా రాకకు తప్పని నిరీక్షణ!

  • IndiaGlitz, [Wednesday,November 11 2020]

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చెర్రీకి హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఆలియా మొదటి వారంలోనే సెట్‌లో అడుగు పెట్టనుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే అమ్మడు రాక కోసం నిరీక్షణ తప్పనట్టు తెలుస్తోంది.

ఆలియా మరో రెండు వారాల పాటు ‘ఆర్ఆర్ఆర్‘ సెట్‌లో అడుగు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయ్‌ కథియావాడి’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తవడానికి మరో రెండు వారాలు పడుతుందని తెలుస్తోంది. ‘గంగూబాయ్‌ కథియావాడి’ సినిమా షూటింగ్ పూర్తవనిదే ఆలియా ‘ఆర్ఆర్ఆర్‘ సెట్‌లో అడుగు పెట్టే అవకాశం లేదని సమాచారం.

దీంతో ఆలియా రాకకు తప్పనిసరిగా మరో రెండు వారాలు పడుతుందని సమాచారం. విప్లవ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది. భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ రెండు కేరెక్టర్లకు సంబంధించిన టీజర్లు విడుదలై మంచి ఆదరణను సంపాదించాయి. అయితే భీమ్ టీజర్‌పై మాత్రం కొంత గందరగోళం ఏర్పడింది. ఈ కేరెక్టర్‌పై టోపీ పెట్టి చూపించడంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మొత్తం మీద ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More News

విజయసాయికి వైసీపీ ఎమ్మెల్యే ఝలక్..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. విశాఖకు అప్రకటిత కింగ్.. వైసీపీలో రెండో స్థానం.. అధికారులకు ఎంత చెబితే అంత..

ఒక్క దుబ్బాక ఉపఎన్నిక.. తలెత్తుతున్న ప్రశ్నలెన్నో..

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఏం చెప్పింది? ప్రజలు మార్పు కోరుకోవాలనుకుంటున్నారా? కేసీఆర్ పాలనపై వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులా ఉందా?

దుబ్బాక ఎన్నిక ఫలితం మరింత అప్రమత్తం చేసింది: కేటీఆర్

దుబ్బాక ఎన్నిక ఫలితం తమను అప్రమత్తం చేసిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఓటమికి బాధ్యత వహిస్తా: హరీష్ రావు

దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకూ మంత్రి హరీష్‌రావు చాలా కృషి చేశారు.

ఆ విష‌యం తెలిసి షాక‌య్యాను:  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉంది కాబ‌ట్టి ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాంటూ విజ్జ‌ప్తి చేశారు.