బ‌న్నీ, విజ‌య్  ఏం తింటారో తెలుసుకోవాలి:  హృతిక్ రోష‌న్‌

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే హై ఎనర్జీ. ఆయ‌న డాన్సుల‌కు ప్ర‌త్యేకమైన అభిమానులుంటారు. ఎంద‌రో ఆయ‌న డాన్స్ సూప‌ర్బ్ అంటూ అభినందించారు. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ కూడా చేరారు. బాలీవుడ్ హ్యండ్‌స‌మ్ గ్రీక్‌గా పేరున్న హృతిక్ డాన్సులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు...ఇర‌గ‌దీస్తుంటాడు. ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా హృతిక్ చెన్నై చేరుకున్నారు. ఆయ‌న మాట్లాడుతూ నేను బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఇటీవ‌ల విడుద‌లైన ద‌క్షిణాది సినిమాల‌ను చూడ‌లేక‌పోయాను. కానీ ఇక్క‌డ సినిమాల్లో ఉప‌యోగించే టెక్నాల‌జీకి నేను పెద్ద అభిమానిని. ఇక్క‌డి నుండి ఆ విష‌యాన్ని నేర్చుకోవాలి. సాధార‌ణంగా నాకు క‌థ న‌చ్చితే 30 సెక‌న్ల కంటే ఎక్కువ‌గా ఆలోచించ‌ను. నా మ‌న‌సు, ఆత్మ ఏం చెబుతుందో దాన్ని బ‌ట్టే సినిమాలు చేస్తాను. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ అలాగే చేశాను.

డాన్స్‌కు ఎంతో సాధ‌న అవ‌స‌రం. ఆస్వాదిస్తూ డాన్స్ చేయాలి. భావాల్ని ప‌లికించాలి. మ‌నం డాన్స్‌ను ఎంజాయ్ చేస్తే ఆ భావాలు ముఖంలో క‌న‌ప‌డ‌తాయి. అప్పుడు మూమెంట్స్ కాస్త త‌ప్పైనా పెద్ద తేడా ఉండ‌దు’’ అని చెప్పారు. ఆ సంద‌ర్భంలో అల్లు అర్జున్ డాన్స్ గురించి అడ‌గ్గా ‘‘ఎన‌ర్జిటిక్‌, స్ఫూర్తిదాయకం, స్ట్రాంగ్‌’’ అని బదులిచ్చారు. కోలీవుడ్ హీరో విజయ్ డాన్స్ గురించి అడగ్గా ‘‘నాకు తెలిసి వీళ్లు ర‌హ‌స్యంగా ఏదో తింటున్నారు. ఎందుకంటే రోజంతా ఉత్సాహంతోనే ఉంటారు. వీళ్లు డాన్స్ చేసే ముందు ఏం తింటారో తెలుసుకోవాలి’’ అని బ‌దులిచ్చారు.

More News

త‌మ‌న్నా గురించి స‌మంత ట్వీట్‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను అభినందిస్తూ చెన్నై సొగ‌స‌రి స‌మంత అక్కినేని ట్వీట్ చేసింది. ఇంత‌కూ త‌మ‌న్నాను స‌మంత ఎందుకు అభినందించింది అని చూస్తే..

'కనులు కనులను దోచాయంటే' చూసిన వాళ్లందరికీ నచ్చింది - దుల్కర్ సల్మాన్

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’.

ప్రభాస్‌పై కరోనా ఎఫెక్ట్..!

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల.. చివరికిలా..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

కలకలం.. ఏపీలో నలుగురికి కరోనా..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా హైదరాబాద్‌కూ వచ్చేసింది. హైదరాబాద్‌‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.