ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

  • IndiaGlitz, [Friday,June 26 2020]

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్ దీనికి దృశ్యరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్ రూపంలో నవలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమ అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. స్టార్ హీరోల్లో ఒకరిని దీనికి హీరోగా తీసుకోవాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

‘‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫొరాను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ‘షాడో’ నవలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ వెబ్ సిరీస్‌కు ఓ స్టార్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నాం. ‘షాడో’ నవలా రచయిత మధుబాబుకు ధన్యవాదాలు. ఆయన అంగీకారంతోనే మేము నవలను తెరకెక్కించనున్నాం. షాడో సిరీస్ మొత్తం నాణ్యతలో అంతర్జాతీయ రచనలకు పోటీ పడుతోంది’’ అని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ పేర్కొంది.

More News

రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో 'సైనైడ్‌'

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా 'సైనైడ్'.

రచ్చకెక్కిన దాస‌రి త‌న‌యుల ఆస్థి గొడ‌వ‌

సీనియ‌ర్ దివంగ‌త ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుల మ‌ధ్య ఆస్థి గొడ‌వ‌లు రేగాయి. దాస‌రి పెద్ద కొడుకు ప్ర‌భు, చిన్న కొడుకు అరుణ్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌

హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..

కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు.

చైనాపై పోరులో భారత్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన అమెరికా!

చైనాపై పోరుకు సిద్ధమవుతున్న భారత్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది.

ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22వేల 305 శాంపిల్స్‌ని పరీక్షించగా 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.