'షేర్‌' సినిమా బాక్సాఫీస్‌ వసూళ్లలో దూసుకుపోతున్నందుకు ఆనందంగా ఉంది: నిర్మాత కొమర వెంకటేష్‌

  • IndiaGlitz, [Saturday,October 31 2015]

డేరింగ్‌ స్టార్‌ నందమూరి కళ్యాణ్‌రామ్‌ - సోనాల్‌ చౌహాన్‌ జంటగా మల్లిఖార్జున్‌.ఎ దర్శకత్వంలో విజయలక్ష్మి పిక్చర్స్‌ పతాకంపై కొమర వెంకటేష్‌ నిర్మించిన చిత్రం 'షేర్‌'. తమన్‌ ఎస్‌.ఎస్‌ సంగీతం అందించారు. షేర్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న రిలీజై ఘనవిజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.

ఈ సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ ..-''షేర్‌ రిలీజ్‌ రోజునుంచి మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలొచ్చాయి. కళ్యాణ్‌రామ్‌ మునుపటి కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించారని, చక్కని అభినయంతో ఆకట్టుకున్నాడని అంతా ప్రశంసిస్తున్నారు. ఫైట్స్‌, పాటల్లో కళ్యాణ్‌రామ్‌ పెర్ఫామెన్స్‌ చాలా ప్రత్యేకంగా ఉందన్న టాక్‌ వచ్చింది. అలాగే కామెడీ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆడియెన్‌ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం, రఘు కారుమంచి, పృథ్వీ సహా హాస్యనటులతో తెరకెక్కించిన సన్నివేశాలకు అందరూ బాగా నవ్వుకుంటున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రమిదన్న ప్రశంసలొచ్చాయి. ఆడిటోరియం నుంచి హాస్య సన్నివేశాలు వచ్చినప్పుడు ఒకటే సందడి. ఈ విజయం నా హీరో కళ్యాణ్‌రామ్‌, నా నిర్మాత కొమర వెంకటేష్‌ వల్లనే సాధ్యమైంది. కళ్యాణ్‌రామ్‌ మరోసారి చక్కని సహకారం అందించి నటించారు. అది సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యింది. మా నిర్మాత కొమర వెంకటేష్‌ ప్రతి ఫ్రేము రిచ్‌గా, చక్కగా వచ్చేందుకు కావాల్సిన అన్ని వసతుల్ని కల్పించారు. పరిశ్రమకి ఇలాంటి నిర్మాతలు చాలా అవసరం. ప్రతి దానిని కమర్షియల్‌ కోణంలో ఆలోచించకుండా సినిమా బావుండాలని నిర్మాత పనిచేశారు. డైమండ్‌ రత్నం మాటలు, చంటి యాక్షన్‌, తమన్‌ సంగీతం ప్రతిదీ సినిమాలో హైలైట్‌. తమన్‌ అందించిన పాటలు, రీరికార్డింగ్‌ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా ఈ సినిమా చివరి 25 నిమిషాలు థియేటర్లలో ఆడియెన్‌ని ఎంతో మెస్మరైజ్‌ చేసింది. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్‌రామ్‌, కొమర వెంకటేష్‌లకు రుణపడి ఉంటాను'' అని అన్నారు.

చిత్ర నిర్మాత (చిత్రపురి కాలనీ అధ్యక్షుడు, ఫెడరేషన్‌ అధ్యక్షుడు) కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ -''షేర్‌ చిత్రానికి రిలీజ్‌ రోజు నుంచి ఆడియెన్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.. ఇదో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ముఖ్యంగా మా హీరో కళ్యాణ్‌రామ్‌ నటన చిత్రానికే హైలైట్‌. పాటల్లో, డ్యాన్సుల్లో చాలా అందంగా కనిపించాడన్న ప్రశంసలొచ్చాయి. అలాగే హాస్యం సినిమాకే హైలైట్‌ అన్న టాక్‌ వచ్చింది. ముఖ్యంగా చివరి 25 నిమిషాల పాటు థియేటర్లలో ఆడియెన్స్‌ నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. హైదరాబాద్‌ లోకల్‌గా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందన చూశాం. అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా కామెడీ, పాటలు, ఫైట్స్‌ సినిమాలో హైలైట్‌గా ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. నా వెంట ఉండి ప్రోత్సాహం అందించిన అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు'' అన్నారు.

మాటల రచయిత డైమండ్‌ రత్నం మాట్లాడుతూ -''పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం .. సినిమాలకు మాటల రచయితగా పనిచేశాను. తర్వాత షేర్‌ చిత్రానికి కథ, మాటలు అందించాను. దర్శకుడు మల్లితో కలిసి షేర్‌ కథ రాశాను. ఈ సినిమా ఇటీవలే రిలీజై ఘనవిజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. హైదరాబాద్‌ సత్యం థియేటర్‌లో స్పందన చూశాను. బ్రహ్మీ, రఘు, పృథ్వీ తదితర గ్యాంగ్‌ నటించిన హాస్య సన్నివేశాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. నా కెరీర్‌లో మొదటి సినిమా 'దేవదాసు' మొదటి వారం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత 175రోజులు విజయవంతంగా ఆడింది. అదేవిధంగా ఈ షేర్‌ కూడా విజయపథంలో దూసుకుపోతోంది'' అన్నారు.

నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ -''ఈ సినిమా రిలీజ్‌కి సరిగ్గా ఐదు రోజుల ముందు చిత్రపురి ఎన్నికల్లో గెలుపొందారు మా నిర్మాత. బ్యాలెట్‌ వద్ద కలెక్షన్‌ కింగ్‌ అనిపించుకున్నారు. అలాగే షేర్‌ రిలీజైన తర్వాత బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ కింగ్‌ అనిపించుకుంటున్నారు. దర్శకుడు మల్లిఖార్జున్‌కి ఇదో చక్కని విజయం. ఈ సినిమాలో నేను చిత్తూరు, అనంతపురం యాసలో మాట్లాడాను. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంతకుముందు తెలంగాణ యాసలో మాట్లాడేవాడిని. ఈసారి కొత్తగా ప్రయత్నించినందుకు ఆడియెన్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నిర్మాత పెట్టుబడుల్లో ఎక్కడా రాజీకి రాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు చక్కని క్యారెక్టర్‌ ఇచ్చి ప్రోత్సహించినందుకు థాంక్స్‌. నాతో పాటు బ్రహ్మీ, పృథ్వీ అందరూ చక్కని హాస్యం పండించారు'' అన్నారు.

More News

మరో భారీ చిత్రంలో అనుష్క

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...అరుంథతి, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో...ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ..స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న అందాల తార అనుష్క.

శంక‌రాభ‌ర‌ణం కి సెంటిమెంట్ క‌లిసొస్తుందా..

తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోలేని సంచ‌ల‌న‌ చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ సంచ‌ల‌న సినిమాని క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ తెర‌కెక్కించారు.

సంక్రాంతి రేసులో వ‌రుణ్ తేజ్

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మా అమ్మ మ‌హాల‌క్ష్మి. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

నిర్మాతను మార్చేసిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ్ చిత్రం తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా బ్రూస్ లీ నిర్మాత దానయ్యే నిర్మించాలనుకున్నారు. చరణ్ కూడా ఓకె అన్నాడు. అయితే బ్రూస్ లీ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ చరణ్ నిర్మాతను మార్చేసాడట

నాగ‌చైత‌న్య తొలిసారిగా..

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది చిత్రాల్లో హీరోగా న‌టించాడు. ప్ర‌స్తుతం ప‌ద‌కొండ‌వ సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'తో బిజీగా ఉన్నాడు.