close
Choose your channels

పి.వి.సింధుని చూసి గ‌ర్వ‌ప‌డున్నాం:  నాగార్జున అక్కినేని

Saturday, September 14, 2019 • తెలుగు Comments

ఇటీవ‌ల జ‌రిగిన వ‌రల్డ్ బ్యాడ్మింట‌న్ పోటీల్ జ‌పాన్‌కు చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ నొజొమి ఒకుహ‌రను ఫైన‌ల్లో ఓడించి వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిచిన తెలుగు తేజం పి.వి.సింధు. ఈ విజ‌యంతో దేశమంతా గ‌ర్వంతో ఉప్పొంగింది. పలువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఆమెను అభినందించారు. శ‌నివ‌రాం ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు చాముండేశ్వ‌రినాథ్  పి.వి.సింధుకి ఖ‌రీదైన బి.ఎం.డ‌బ్ల్యు కారుని హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా బ‌హుక‌రించారు. 

ఈ సంద‌ర్భంగా..

``సింధు వ‌రల్డ్ బ్యాడ్మింట‌న్ ఫైన‌ల్ అడేట‌ప్పుడు నేను ఇండియాలో నేను ఆమె గెలిచిన మ్యాచ్ చూసి నాకు పి.వి.సింధు బాగా తెలుసు అని అక్క‌డున్న వారికి పి.వి.సింధు నాకు తెలుసున‌ని చెప్పుకున్నాను. సింధుని ఎన్ని ర‌కాలుగా అప్రిషియేట్ చేసినా త‌క్కువే. సింధుని చూసి చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను. చాలా అద్భుత‌మైన విజ‌య‌మ‌ది. ఈ విజ‌య‌ప‌రంప‌ర‌ను ఆమె ఇంకా కొన‌సాగించి మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేయాలి. చాముండేశ్వ‌రినాథ్ ఇప్ప‌టి వ‌ర‌కు 22 కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. సింధుకి ఆయ‌న గిఫ్ట్‌గా ఇస్తున్న నాలుగో కారు ఇది. సింధుకే కాదు.. దేశంలోని చాలా మంది అథ్లెట్స్‌ను గుర్తించి వారికి గైడెన్స్ ఇవ్వ‌డంలో చాముండి ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న‌కు థ్యాంక్స్‌`` అన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz