పి.వి.సింధుని చూసి గ‌ర్వ‌ప‌డున్నాం:  నాగార్జున అక్కినేని

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

ఇటీవ‌ల జ‌రిగిన వ‌రల్డ్ బ్యాడ్మింట‌న్ పోటీల్ జ‌పాన్‌కు చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ నొజొమి ఒకుహ‌రను ఫైన‌ల్లో ఓడించి వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిచిన తెలుగు తేజం పి.వి.సింధు. ఈ విజ‌యంతో దేశమంతా గ‌ర్వంతో ఉప్పొంగింది. పలువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఆమెను అభినందించారు. శ‌నివ‌రాం ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు చాముండేశ్వ‌రినాథ్ పి.వి.సింధుకి ఖ‌రీదైన బి.ఎం.డ‌బ్ల్యు కారుని హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా బ‌హుక‌రించారు.

ఈ సంద‌ర్భంగా..

''సింధు వ‌రల్డ్ బ్యాడ్మింట‌న్ ఫైన‌ల్ అడేట‌ప్పుడు నేను ఇండియాలో నేను ఆమె గెలిచిన మ్యాచ్ చూసి నాకు పి.వి.సింధు బాగా తెలుసు అని అక్క‌డున్న వారికి పి.వి.సింధు నాకు తెలుసున‌ని చెప్పుకున్నాను. సింధుని ఎన్ని ర‌కాలుగా అప్రిషియేట్ చేసినా త‌క్కువే. సింధుని చూసి చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను. చాలా అద్భుత‌మైన విజ‌య‌మ‌ది. ఈ విజ‌య‌ప‌రంప‌ర‌ను ఆమె ఇంకా కొన‌సాగించి మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేయాలి. చాముండేశ్వ‌రినాథ్ ఇప్ప‌టి వ‌ర‌కు 22 కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. సింధుకి ఆయ‌న గిఫ్ట్‌గా ఇస్తున్న నాలుగో కారు ఇది. సింధుకే కాదు.. దేశంలోని చాలా మంది అథ్లెట్స్‌ను గుర్తించి వారికి గైడెన్స్ ఇవ్వ‌డంలో చాముండి ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న‌కు థ్యాంక్స్‌'' అన్నారు.

More News

‘సైరా’కు షాక్.. చిరు ఆఫీస్ ముందు ఆందోళన!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన చరిత్రాత్మక చిత్రం ‘సైరా’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..

అఖిల్ కోసం పూజా డిమాండ్ చేసిన రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. జి.ఎ 2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిరు కోసం స‌ల్మాన్

మెగాస్టార్ చిరంజీవి కోసం బాలీవుడ్ స్టార్ హీరో, కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ త‌న వంతు స‌పోర్ట్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

'తలైవి' కోసం నాలుగు గెట‌ప్స్‌లో కంగ‌నా!

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను ముగ్గురు ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తున్నారు.

`క్వీన్‌`కు షాక్ త‌గ‌ల‌నుందా?

త‌మిళ‌నాడు రాజ‌కీయాలను ప్ర‌భావితం చేసిన మ‌హిళానేత విప్ల‌వ నాయ‌కురాలు జ‌య‌ల‌లిత బ‌యోపిక్ సినిమాల రూపంలో, వెబ్ సిరీస్ రూపంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.