ఐదేళ్లలో చేయలేనిది 11 నెలల్లో చేశాం - నారా లోకేష్


Send us your feedback to audioarticles@vaarta.com


ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదు. అవ్వాతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ....అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలి. బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చాం. ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 11నెలల ప్రజాప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ 4వేలకు, వికలాంగ పెన్షన్ 6వేలకు పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నాం." అన్నారు.
మన ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తుందని వైసిపి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు లోకేష్. ఒక్క పాఠశాలను కూడా మూయడం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం 1200 స్కూళ్లలో క్లాసుకో టీచర్ ఉంటే, ఇప్పుడు 9800 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని తెలిపారు.
జనసేనతో కలిసి పోటీ చేశామని, భవిష్యత్తులో కలిసే ప్రయాణం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేవని... వైసిపి వాళ్లు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్లలో చేయలేని ఎన్నో పనుల్ని కూటమి ప్రభుత్వం 11 నెలల్లోనే చేసి చూపించిందన్నారు లోకేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com