మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి:  పూరీ జగన్నాథ్‌

పలు విషయాలపై అవగాహన పెంచుతూ తనకు తెలిసిన విషయాల గురించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మ్యూజింగ్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ట్రాష్‌ బ్యాగ్స్‌ అనే అంశం గురించి మాట్లాడుతూ ..ఎడ్మండ్‌ హిల్లరీ ఎలాగైనా ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కాలనుకున్నాడు. అందరితో కలిసి ప్లాన్‌ చేశాను. 362 మంది పోర్టర్స్‌, 20 మంది షేర్‌ పాస్‌, కొంత మంది డాక్టర్స్‌ అందరూ కలిసి 400 మంది అయ్యారు. తిండి, ఇతర సామాన్లు కలుపుకుని 4500 కిలోల బరువుతో ఆయన ప్రయాణాన్ని ప్రారభించారు. కొంత దూరం వెళ్లాక కొంత లగేజీ అవసరం లేదనిపించి అక్కడే వదిలేశాడు. బేస్ క్యాంప్‌కు రీచ్‌ అయ్యే సరికి ఇంకొంత లగేజ్‌ అవసరం లేదనిపించింది. కొన్ని టెంట్స్‌ తీసేశారు. కొంత మందిని వెనక్కి పంపేశాడు. మోస్తూ నడుస్తుంటే ఇవేవీ అనవసరం అని మెల్లమెల్లగా అర్థమైంది.

చివరగా అతనొక్కడే ఎవరెస్ట్‌ ఎక్కాడు. ఎవరెస్ట్‌ ఎక్కాలనుకుంది ఎడ్మండ్‌ హిల్లరీ ఈ నాలుగు వందల మంది కాదు. అలాగే జీవితంలో నువ్వు అనుకున్న ప్లేస్‌కు వెళ్లాలంటే అనవసరమైన లగేజీతో వెళ్లకూడదు. కొండకు తాడు కట్టి ఎక్కుతున్నప్పుడు నీకు నువ్వే బరువు. దానికి తోడు కొంతమంది నిన్ను పట్టుకుని వేలాడుతుంటే నా బొందెక్కుతావ్‌..మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. సగం చెత్త మనుషుల రూపంలో ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసే సరికి సగం జీవితం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. ట్రాష్‌ బ్యాగ్స్‌ ఎప్పుడూ నవ్వుతూ, మనతో మాట్లాడుతూ, మనతోనే ఉంటాయి అన్నారు.

More News

అన్నయ్య టైటిల్‌తో....

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

సంక్రాంతి కి విడుదల కానున్న ‘రెడ్ ‘

సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌' తర్వాత   ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ హీరోగా చేసిన సినిమా ‘రెడ్' .

విజయదశమినాడు లాంఛనంగా ప్రారంభమైన నాగచైతన్య 'థాంక్యూ'

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 'థాంక్యూ'

సామాన్యుడి శక్తిని చాటే 'ఆకాశం నీ హద్దురా'

ఆవేశం అందరికీ ఉంటుంది.. కానీ ఆలోచనతో ముందుకు సాగడం కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఆవేశం, ఆలోచన కలిస్తే ఏమవుతుంది.

వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం !

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో