Chandrababu: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా అప్పుడే ప్రకటిస్తాం: చంద్రబాబు

  • IndiaGlitz, [Wednesday,March 13 2024]

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో అన్ని పార్టీలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, వైసీపీ కొంతమంది అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా తమ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వీలైనంత వరకు మెజారిటీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. ఇందులో ఎంపీ స్థానాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. దీంతో తొలి జాబితాలో చోటు దక్కని నేతలు రెండో జాబితాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందన్నారు. ఆ రెండు పార్టీలు కూడా సమయం చూసుకుని అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని తెలిపారు. పొత్తులు తమ కోసం కాదని రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమేనని తెలిపారు. పొత్తులు గురించి కొందరు రకరకాలుగా మాట్లాడతారని తాను వాటిని పట్టించుకోనని స్పష్టంచేశారు. పొత్తులో భాగంగా కొంతమందికి టికెట్లు రాకపోవచ్చని.. కానీ ఎవరూ బాధపడొద్దని సూచించారు. తాము గతంలోనూ ఎన్డీఏలో పనిచేసిన సంగతిని గుర్తు చేశారు.

కాగా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తు్న్న సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల నుంచి బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 6 మంది అభ్యర్థులను వెల్లడించింది.

మరోవైపు ఈనెల 17న చిలకలూరిపేటలో ఈ కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి నేతలు భూమిపూజ చేశారు. 2014 తర్వాత కలిసి మూడు పార్టీలు ఏర్పాటుచేస్తున్న సభ కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోదీతో పాటు టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరుకానున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

More News

Harish Shankar: 'ఉస్తాద్ భగత్‌సింగ్' ఐదు రోజులే షూటింగ్ చేశాం.. హరీష్ కామెంట్స్..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన కటిమ్ అయిన సినిమాల షూటింగ్ వాయిదాపడింది. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా ఉంది.

Electoral bonds: 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు.. సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్..

ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు దెబ్బకి ఎట్టకేలకు SBI దొగొచ్చింది. న్యాయస్థానం చెప్పిన గడువులోగా బాండ్స్ వివరాలు సమర్పించింది. ఈ మేరకు కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

Mudragada: వైసీపీలోకి ముద్రగడ చేరిక వాయిదా.. ఎందుకంటే..?

కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వాయిదాపడింది. గురువారం తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

ఏపీలో ఎన్నికల సమరానికి సమయం సిద్ధమైంది. మరో రెండు రోజల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార వైసీపీ కురుక్షేత్రానికి సిద్ధమైంది. ఈనెల 16న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను

చిలకలూరిపేట సభకు భూమి పూజ.. పాల్గొన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు..

ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి భూమి పూజ చేశారు.