టీమిండియా క్రికెటర్లను చంపేస్తాం!

టీమిండియా క్రికెటర్లను చంపేస్తామని ఓ యువకుడి నుంచి బీసీసీఐకి బెదిరింపు మెయిల్ వచ్చింది. బీసీసీఐ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్‌కు ఆ మెయిల్‌ను పంపగా.. కొన్ని గంటల్లోనే ఆ మెయిల్‌ పంపిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాగా ఆ యువకుడిని అసోంకు చెందిన బ్రజ మోహన్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. మోరీగావ్ జిల్లా ధర్మతుల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ముంబైకి తరలించారు. ఆగస్టు 20న ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో అతడికి ఆగస్టు 26 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

ఇంతకీ ఎవరు..!?

ఇదిలా ఉంటే.. టీమిండియా క్రికెటర్లు అంటే ఇండియాలో ఉండే క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా మరీ చెప్పాల్సిన పన్లేదు. అంతేకాదు.. క్రికెటర్లను దేవుళ్లుగా చూసే దేశం మనది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మన టీమిండియా క్రికెటర్లనే బెదిరించడంతో అసలు ఆ యువకుడి వెనుక ఎవరున్నారు..? టెర్రరిస్టులే ఇలా చేయించారా..? ఇంతకీ ఆ మెయిల్ ఎందుకు పెట్టాడు? అనే కోణంలో విషయాలను టెర్రరిజమ్ స్క్వాడ్‌ ఆరా తీస్తోంది. మరి ఫైనల్‌గా ఈ వ్యవహారంలో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే మరి.