వెంక‌టేశ్‌తో వెబ్ సిరీస్‌..!!

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

ఇప్పుడు సిల్వ‌ర్‌స్క్రీన్‌కు స‌మానంగా డిజిట‌ల్ మీడియం శ‌ర‌వేగంగా అభివృద్ధి అవుతున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువైంది. దీంతో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో అంద‌రికీ ఓటీటీ ఒక్క‌టే వినోద సాధ‌నంగా మారింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ స‌హా ప‌లు ఓటీటీ సంస్థ‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌సాగాయి. తెలుగులో ఆహా అనే ఓటీటీ ప్రారంభ‌మైంది. ప‌దికోట్ల‌ను మించిన తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మ‌రిన్ని నెట్‌ఫ్లిక్స్‌లు రావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని ఈ స‌మ‌యంలో అనిపిస్తోంది. అదే స‌మ‌యంలో తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత‌లు డి.సురేష్‌బాబు, దిల్‌రాజులు క‌లిసి ఓటీటీలోకి అడుగు పెట్ట‌బోతున్నార‌ని టాక్‌.

అగ్ర క‌థానాయ‌కులు సైతం సినిమాల‌తో పాటు డిజిట‌ల్ మీడియాల్లో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యే వెబ్‌సిరీస్‌ల్లోనూ న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. ఇప్ప‌టికే తాను కూడా వెబ్‌సిరీస్‌ల్లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి ప్ర‌క‌టించేశారు కూడా. ఆయ‌న బాట‌లోనే మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు వెంక‌టేశ్ కూడా అడుగుపెట్ట‌బోతున్నారని టాక్‌. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ‌తో వెంక‌టేశ్ ఈ విష‌య‌మై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌రోనా ప్ర‌భావం ముగిసిన త‌ర్వాతే దీనిపై మ‌రింత క్లారిటీ రానుంది.

More News

ప్ర‌మాదం నుండి త‌ప్పుకున్న రానా

రానా క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రాల్లో ‘విరాట‌ప‌ర్వం’ ఒక

‘ఆకాశ‌వాణి’ నుండి కార్తికేయ త‌ప్పుకోడానికి కార‌ణ‌మదేనా?

చాలా రోజుల క్రితం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ‘ఆకాశవాణి’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. గుణ్ణం గంగ‌రాజు త‌న‌య‌డుఉ అశ్విన్ గంగ‌రాజు

ఇట‌లీ `రెడ్‌` ట్రిప్ క‌ళ్ల‌ముందు మెదులుతోంది! : 'స్ర‌వంతి' ర‌వికిశోర్‌

``కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను అవ‌త‌లివాళ్లు చెబుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. మ‌రికొన్నిసార్లు న‌మ్మ‌బుద్ధి కాదు. ఆ మాట‌ల్లో అతిశ‌యోక్తులు ధ్వ‌నిస్తాయి. కానీ అలాంటిసంఘ‌ట‌న‌లు

విశాఖ గ్యాస్ లీకేజ్‌పై ఎల్జీ పాలిమర్స్ సుధీర్ఘ వివరణ..

విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది చెందగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి.. 2వేలకు చేరువలో కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అయితే కేసులు సంఖ్య