close
Choose your channels

అస‌లు కాజల్ ఏం చెప్పాల‌నుకుంటుంది?

Tuesday, December 1, 2020 • తెలుగు Comments

అస‌లు కాజల్ ఏం చెప్పాల‌నుకుంటుంది?

రీసెంట్‌గా త‌న క్లాస్‌మేట్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. హానీమూన్ మూడ్‌లోనే ఉంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు క‌మిట్ అయ్యుంది. ఈ సినిమాల సెట్స్‌లోకి ఎప్పుడు అడుగు పెడుతుందో తెలియ‌డం లేదు కానీ.. రీసెంట్‌గా ఓ హార‌ర్ సినిమాలో న‌టించ‌బోతుంద‌ని తెలిసింది. ద‌ర్శ‌కుడు డీకే ఓ హార‌ర్ మూవీని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాలో న‌లుగురు హీరోయిన్స్ ఉంటార‌ట‌. అందులో ఓ హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌నేది స‌మాచారం.

అస‌లు కాజల్ ఏం చెప్పాల‌నుకుంటుంది?

నిజం చెప్పాలంటే ద‌శాబాద్దానికి పైగా హీరోయిన్‌గా ప‌లు పాత్ర‌ల‌తో మెప్పించిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. తొలిసారి హార‌ర్ జోన‌ర్ మూవీలో న‌టించ‌నుంది. మ‌రి కాజ‌ల్ చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం ఆమెకు ఎంత వ‌ర‌కు స‌క్సెస్‌నిస్తుంద‌నేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే కాజ‌ల్ క‌మ‌ల్‌హాస‌న్ టైటిల్ పాత్ర చేస్తున్న సినిమా ఇండియ‌న్ 2తో పాటు..చిరంజీవి, కొర‌టాల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆచార్య సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇది కాకుండా దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తుంది. వీటితో పాటు మ‌రో కొత్త సినిమాకు కాజ‌ల్ ఓకే అందంటే.. ఆమె పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేయ‌డానికి ఒప్పుకున్న‌ట్లేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz