కౌశల్ భార్యకు ఏమైంది.. ఆందోళన కలిగించేలా పోస్ట్ !

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు విజేత కౌశల్ మందా. బిగ్ బాస్ ముందు వరకు కౌశల్ ఒక సాధారణ నటుడు, మోడల్ మాత్రమే. కానీ బిగ్ బాస్ షో తర్వాత కౌశల్ ఓ హీరోలా మారిపోయాడు. కౌశల్ కు మద్దతుగా కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపైన్ నడిచింది.

అంతలా కౌశల్ బిగ్ బాస్ లో తన పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ప్రభావితం చేశారు. అదే సమయంలో కౌశల్ చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. కౌశల్ ఆర్మీ నిధుల్ని దుర్వినియోగం చేశారు అంటూ కౌశల్ తో పాటు అతడి భార్య నీలిమ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇదిలా ఉండగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని కౌశల్ గతంలోనే తెలిపాడు. తాజాగా కౌశల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉంది.

'ఏదో ఒకటి సాధించేందుకు వచ్చావు. ఏదో చేయాలనే ఉద్దేశంతో జీవితంతో పోరాడుతున్నావు. ధైర్యంగా నువ్వు అనుకున్నవి సాధిస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను'అని కౌశల్ తన భార్యని ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టాడు.

దీనితో అభిమానులు ఆందోళన చెందుతూ కామెంట్స్ పెడుతున్నారు. వదినకు ఏమైంది అన్నా, ఆమె త్వరగా కోలుకోవాలి అని కౌశల్ పోస్ట్ కి కామెంట్స్ చేస్తున్నారు.

More News

బోల్డ్ సీనా.. అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి

బోల్డ్ కంటెంట్, అడల్ట్ కామెడీ ఉండే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చిత్రాల్లో ఇంటిమేట్ రొమాంటిక్ సీన్లు, శృంగార భరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ ప్రేమ కథలు కూడా ఉంటాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

దివంగత నటుడు, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ప్రత్యేకం. దాదాపు దశాబ్దానికి పైగా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగని హద్దులు దాటే గ్లామర్ ఒలకబోయలేదు.

ఎన్టీఆర్ కి భారతరత్న.. మెగాస్టార్ ఎలా డిమాండ్ చేశారో చూడండి

నేడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులంతా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

2-డీజీ ఔషధం ధర ఫిక్స్..

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది.