close
Choose your channels

త‌మ‌న్నాకి ఏమైంది..?

Monday, September 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మ‌న్నాకి ఏమైంది..?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు ఏమైంద‌ని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడిన ఈ అమ్మ‌డు ఇప్పుడు రెమ్యున‌రేష‌న్ మాయ‌లో ప‌డిందా? అంటే చూసేవారికి అవున‌నే అనిపిస్తుంది. ఎందుకంటే ఈమ‌ధ్య త‌మ‌న్నా ఓకే చెబుతున్న సినిమాల‌ను చూస్తే అలాగే అనిపిస్తుంద‌ని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కాలుక‌దిపిన ఈ అమ్మ‌డు ఇప్పుడు ఏ సినిమాలో ప‌డితే అందులో న‌టించేయ‌డానికి రెడీ అయిపోతుంద‌ని, ఆమె అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇస్తే చాలున‌ని అనిపించేలా ఉంద‌ని టాక్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ మ‌ధ్య స‌త్య‌దేవ్‌తో ల‌వ్‌మాక్‌టైల్ రీమేక్ గుర్తుందా శీతాకాలంలో త‌మ‌న్నా న‌టించ‌డానికి ఓకే చెప్ప‌గానే ఆమె అభిమానులు షాక‌య్యారు. ఈ షాక్‌నుండి తేరుకోక‌ముందే మిల్కీబ్యూటీ మ‌రో షాకిచ్చింది. అదే నితిన్ అంధాదున్ రీమేక్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్ప‌డం. మిడిల్ ఏజ్ ఉన్న మ‌హిళగా హిందీలో ట‌బు చేసిన పాత్ర‌ను తెలుగులో త‌మ‌న్నా చేయ‌డానికి అంగీక‌రించ‌డ‌మే. న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్రే అయినా, ఆ పాత్ర‌లో త‌మ‌న్నా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం త‌మ‌న్నాకు కోటిన్న‌ర‌కు పైగా రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి నిర్మాత‌లు ఓకే చెప్పార‌ని, అందుకే మిల్కీబ్యూటీ కూడా ఓకే చెప్పింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.