బాహుబ‌లి ప్రారంభాని కంటే ముందు ఏం జ‌రిగింది..?

  • IndiaGlitz, [Friday,January 20 2017]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తెలుగు సినిమా బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతటి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇక బాహుబ‌లి 2 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...జ‌య‌పూర్ లో జ‌రిగిన సాహిత్య వేడుక‌కు రాజ‌మౌళి, రానా హాజ‌ర‌య్యారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత నీల‌కంఠ‌న్ ర‌చించిన ది రైజ్ ఆఫ్ శివ‌గామి పుస్త‌కం క‌వ‌ర్ పేజీని ఆవిష్క‌రించారు. బాహుబ‌లిలో ముఖ్య‌పాత్ర పోషించి శివ‌గామి పాత్ర ఆధారంగా ఈ పుస్త‌కం రాసారు.

అస‌లు..బాహుబ‌లి ప్రారంభానికి ముందు ఏం జ‌రిగింది అనే విష‌యాలను ఈ పుస్త‌కంలో రాసార‌ని స‌మాచారం. ఈ పుస్త‌కం ఆవిష్క‌రణోత్స‌వంలో పాల్గొన్న రాజ‌మౌళి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఈ వేడుక‌కు చాలా త‌క్కువ మంది వ‌స్తార‌ని అనుకున్నాను కానీ...అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది అన్నారు. అంతే కాకుండా ఈ పుస్త‌కం క‌వ‌రేజ్ తో పాటు ఈ ఫంక్ష‌న్ కు హాజ‌రైన జ‌నంతో తీసుకున్న సెల్ఫీని కూడా పోస్ట్ చేసారు రాజ‌మౌళి. ఈ పుస్త‌కం మార్చి 7 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

More News

మెగాస్టార్ కి క‌ళాబంధు డా.టి.సుబ్బిరామిరెడ్డి ఆత్మీయ అభినంద‌న‌..!

తెలుగు సినిమాని ద‌శాబ్ధాలు పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఖైదీ నెం 150తో వెండితెర పై ద‌ర్శ‌న‌మిచ్చారు. క‌మ్ బ్యాక్ లోనూ కొత్త రికార్డులు సృష్టించి క‌ల‌క‌లం రేపారు మెగాస్టార్.

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తుల కోసం ఖైదీ నెం 150 స్పెష‌ల్ షో..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్రెస్టేజీయ‌స్ మూవీ ఖైదీ నెం 150. దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత చిరంజీవి న‌టించిన సినిమా కావ‌డంతో ఖైదీ నెం 150 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రూ విశేషంగా ఆదిరిస్తున్నారు.

సినిమా చూడ‌కుండా ఉండ‌డానికి ఒక్క రీజ‌న్ చెప్ప‌మంటున్న నాని..!

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కించారు.

మ‌హేష్ మూవీ షూటింగ్ డీటైల్స్..!

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నవదీప్ 'నటుడు'

యంగ్ హీరో నవదీప్,కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో