మహేష్ అయితే ఏంటి..?

  • IndiaGlitz, [Tuesday,June 13 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'శ్రీమంతుడు' చిత్రం మ‌హేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే, శ్రీమంతుడు విడుద‌ల త‌ర్వాత అస‌లు శ్రీమంతుడు క‌థ నాదే అంటూ శ‌ర‌త్ చంద్ర అనే వ్య‌క్తి కేసు వేసిన సంగ‌తి తెలిసిందే.

స్వాతి వీక్లిలో 2012లో తాను రాసిన చ‌చ్చేంత ప్రేమ న‌వ‌ల‌ను కాపీ చేసే శ్రీమంతుడు సినిమా చేశార‌నేది కేసు. నాంప‌ల్లి కోర్టులో వాదోప‌వాదాలు జ‌రిగాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిర్మాత‌ల్లో మ‌హేష్ కూడా ఒక‌రు కావ‌డంతో, మ‌హేష్ కూడా కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌న స్థానంలో మ‌రొక‌రు కోర్టుకు హాజ‌ర‌వుతార‌ని మ‌హేష్ కోర్టుకు చేసిన అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తోసి పుచ్చి, కోర్టుకు హాజ‌రుకావాల్సిందేన‌ని తెలిపింది.

More News

ఖాన్ తో ప్రభాస్..

బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్కు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. గతంలో ప్రభుదేవా యాక్షన్ జాక్సన్ చిత్రంలో ఓ పాటలో అలా మెరిసిన ప్రభాస్ ఏకంగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడట.

శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల చిత్రం రామోజీ ఫిలిమ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్-ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

జూలై రెండో వారంలో గల్ఫ్

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం విడుదలకు సిద్దమైంది.

సినారె సేవలు చిరస్మరణీయం! - నందమూరి బాలకృష్ణ

తెలుగు భాషకు సి.నారాయణరెడ్డిగారు చేసిన సేవలు చిరస్మరణీయం.

'డా. సి.నారాయణరెడ్డి గారు ఆఖరిపాట రాసిన చిత్రo ఆయనకే అంకితం'

H- పిక్చర్స్ పతాకం పై మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో, హీరోయిన్ గా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వoలో, హసీబుద్దిన్ నిర్మాతగా రూపుదిద్దికున్న చిత్రం మనసైనోడు.