చ‌ర‌ణ్ ఫ్యాన్స్ తో రేష్మి గొడ‌వేంటి..?

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ ధృవ‌. ఈ చిత్రం ఈనెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ధృవ ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 10.57 కోట్లు షేర్ సాధించిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే...సోష‌ల్ మీడియాలో ధృవ క‌లెక్ష‌న్స్ విష‌య‌మై చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి యాంక‌ర్ రేష్మికి మ‌ధ్య వార్ న‌డుస్తుంది. ఇంత‌కీ ఏం జ‌రిగింది అంటే...ఎవ‌రో ఓ వ్య‌క్తి రేష్మి న‌టించిన గుంటూరు టాకీస్ విజ‌య‌వాడ‌లో ఫ‌స్ట్ డే 17 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. రామ్ చ‌ర‌ణ్ ధృవ విజ‌య‌వాడ‌లో ఫ‌స్ట్ డే 14 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను రేష్మి రీట్వీట్ చేస్తూ ఫ‌న్ గా తీసుకున్నాను అంది.

రేష్మి రీట్వీట్ పై చ‌ర‌ణ్ ఫ్యాన్ ఫైర్ అవుతూ ఎవ‌డో దురాభిమాని ట్వీట్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావా అని రేష్మిని ప్ర‌శ్నించాడు. దీనికి రేష్మి స్పందిస్తూ...ఏది జోక్ గా తీసుకోవాలో నాకు తెలుసు నా ఇష్టం అంటూ కాస్త ఘాటుగానే స‌మాధానం చెప్పింది. చ‌ర‌ణ్ ఫ్యాన్స్ రేష్మి మ‌ధ్య వార్ ఇంత‌టితో ఆగ‌లేదు. నాన్ క‌మ్మ హీరోల‌ను త‌క్కువుగా చూస్తున్నావ్ అని చ‌ర‌ణ్ ఫ్యాన్ అంటే...కులాల గురించి చిన్న‌ప్పుడు స్కూల్ పుస్త‌కాల్లో చ‌దువుకున్నాను. కులాల గురించి మాట్లాడుతున్నావ్ మ‌నం ఏ కాలంలో ఉన్నాం. మాకు ప‌ని ఉంది బాధ్య‌త ఉంది దీనిని ఇక్క‌డితో ఆపితే మంచిది అని చెప్పింది. మ‌రి...చ‌ర‌ణ్ ఫ్యాన్స్ తో రేష్మి మాట‌ల యుద్దం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

11న డైరెక్ట్ గా మార్కెట్ లో S3 ఆడియో

వినూత్నమైన కథాంశాలతో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సంపాందించుకున్న సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఎస్ 3. ఈ చిత్రంలో సూర్య సరసన శ్రుతిహసన్, అనుష్క నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు. గతంలోయముడు, సింగం చిత్రాలు ఘనవిజయాలు సాధించిన విషయం తెలిసి&

రామ్ చరణ్ ధృవ ఫస్ట్ డే కలెక్షన్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ.స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన

ఎన్టీఆర్ - చైత‌న్య - స‌మంత‌..!

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన యువ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్. మ‌హా న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా నాగ అశ్విన్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.  ఇటీవ‌ల స‌మంత ట్విట్ట‌ర్ ద్వారా తెలుగులో సినిమాలు చేస్తున్నాను.

మ‌హేష్ - మురుగుదాస్ మూవీ టైటిల్ ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. దాదాపు 100 కోట్ల‌తో తెలుగు, త‌మిళ్ లో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈనెల 30న వస్తున్న మెట్రో

ప్రేమిస్తే,జర్నీ,పిజ్జా లాంటి వైవిద్యమైన,ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను అందించిన నిర్మాత సురేష్ కొండేటి.