close
Choose your channels

కోడెల మృతికి ‘ఆయనే’ కారణమా..? ఆత్మహత్య కాదా..!?

Monday, September 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోడెల మృతికి ‘ఆయనే’ కారణమా..? ఆత్మహత్య కాదా..!?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి కొడుకే కారణమా..? ఆయన ఆత్మహత్య చేసుకోలేదా..? కోడెలది హత్యేనా..? ఇంతకీ ఆయన ఆత్మ హత్య చేసుకుని పరిస్థితి విషమంగా ఉంటే కేన్సర్ ఆస్పత్రికి ఎందుకు తరలించారు..? ఈయన మృతికి కారణాలు వేరే ఉన్నాయా..? అంటే తాజా పరిణామాలను బట్టిచూస్తే ఇవన్నీ నిజమనిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది..? కారుకులెవరు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఈ ప్రచారంలో నిజమెంత!?
కోడెల మృతిపై ఒకటి కాదు రెండు వందల ప్రశ్నలు వెలుగుచూస్తున్నాయి. ఆత్మహత్య అని కొందరు ప్రచారం, గుండెపోటు అని మరికొందరి ప్రచారం చేస్తున్నారు. కాదు కాదు ఆత్మహత్య చేసుకున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రమాదకర ఇంజక్షన్లు తీసుకున్నారి వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆత్మహత్య చేసుకున్న తర్వాత కోడెలను కేన్సర్ ఆస్పత్రికి ఎందుకు తరలించారు..? హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రులు ఉండగా.. కేన్సర్ ఆస్పత్రికి తరలించిడం వెనుక ఆంతర్యమేంటి..? ఇదంతా పక్కా ప్లాన్‌తో చేశారా..? అని అనుమానాలు వస్తున్నాయి.

ఇంట్లో ఎవరెవరున్నారు?
అసలు కోడెల ఎలా మరణించారు..? ఆత్మహత్య సమయంలో ఇంట్లో ఎవరెవరున్నారు..? ఆత్మహత్యపై డాక్టర్ల రిపోర్టులో ఏముంది..? అని ఆయన అనుచరులు, అభిమానులు పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ కోడెల కుటుంబం, డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సోమవారం ఉదయం 10 గంటల వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించిన ఆయన ఆ తర్వాత ఏం చేశారు..? బెడ్ రూమ్‌లోకి వెళ్లి డోర్స్ ఎందుకు వేసుకున్నారు..? భార్య ఎంత తలుపులు తట్టినా ఎందుకు ఓపెన్ చేయలేదు..? అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న.

కొడుకే కారణమా..!?
రెండు రోజుల క్రితం బీజేపీలో చేరేందుకు సైతం ఆయన ప్రయత్నాలు చేశారని... బీజేపీ నేతలు గరికపాటి, కంభంపాటితోనూ కోడెల చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే కోడెలకు కుటుంబసభ్యులతోనూ గొడవలు జరిగాయని తెలుస్తోంది. కుమారుడితో ఆయన తీవ్రంగా గొడవపడ్డారని... ఈ పరిణామాలు కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గత కొన్ని రోజులు తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

సూసైడ్ లేఖ రాశారా!?
ఆత్మహత్యకు ముందు కోడెల సూసైడ్ లేఖ రాశారా..? ఆ లేఖ ఎక్కడుంది..? అందులో ఏముంది..? కోడెల ఆత్మహత్యకు ఇంటి సమస్యలే కారణమా..? కొడుకుతో గొడవలు ఈ తీవ్ర నిర్ణయానికి దారితీశాయా..? ఇలా కోడెల మరణం చుట్టూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి చూస్తే.. ఈ ప్రశ్నలకు ఎప్పుడు సమాధానాలు వస్తాయో..? అసలేం జరిగిందో అన్నది పైనున్న పెరుమాళ్లకే తెలియాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.