శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర ఏంటి ?

  • IndiaGlitz, [Tuesday,September 15 2020]

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని తెలుస్తోంది. సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలతో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఆమె చావుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. వీరి ముగ్గురిలో ఎవరెవరు ఎలా పరిచయమయ్యారు? ఆ తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందో పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇప్పటికే సాయికృష్ణ, దేవరాజ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు అశోక్‌రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సినిమాలపై శ్రావణికి ఉన్న ఆసక్తి ఆమెను కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రప్పించింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సాయికృష్ణారెడ్డితో పరిచయం.. ఆ తరువాత పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆమెకు పలు సినిమా, సీరియళ్లలో అవకాశాలు రావడానికి కూడా కారణం సాయికృష్ణే. వీరిద్దరి ప్రేమ వ్యవహారం 2018 వరకూ సజావుగానే సాగింది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి అశోక్‌రెడ్డి ఎంటర్ అయ్యారు. హీరో కార్తికేయతో అశోక్‌రెడ్డి తీసిన సినిమాలో శ్రావణి ఓ చిన్న పాత్రలో నటించింది.

కార్తికేయ, అశోక్‌రెడ్డి బంధువులు. దీంతో కార్తికేయతో అశోక్‌రెడ్డి ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రావణి చిన్న పాత్రలో నటించింది. అలా అశోక్‌రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. ‘ఆర్ఎక్స్ 100’ హిట్‌తో అశోక్‌రెడ్డితో శ్రావణి పరిచయం మరో మలుపు తీసుకుంది. వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఇటు ఈ రిలేషన్‌లో శ్రావణి ఉండగానే ఆమె జీవితంలోకి దేవరాజ్ ఎంటరయ్యాడు.

గత ఏడాది దేవరాజ్‌తో పరిచయం శ్రావణి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. దేవరాజ్‌తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించిన శ్రావణి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడిపింది. దేవరాజ్‌తో స్నేహం ఆమె కుటుంబ సభ్యులతో పాటు సాయికృష్ణకు కూడా నచ్చలేదు. దీంతో తీవ్ర స్థాయిలో గొడవలు.. విపరీతమైన మానసిక ఒత్తిడితో శ్రావణి నలిగిపోయింది. అయితే దేవరాజ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన శ్రావణికి నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. ఎన్ని సార్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా అతని నుంచి సమాధానం రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అశోక్‌రెడ్డిని కూడా పోలీసులు విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

More News

ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన శివబాలాజీ

కరోనా మహమ్మారి కారణంగా అరకొర జీతాలతో బతికేస్తున్న జనాలపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నిర్వహించేది

బిగ్‌బాస్‌లో అభి వర్సెస్ మొనాల్ వర్సెస్ అఖిల్.. ఇంట్రెస్టింగ్..

బిగ్‌బాస్‌లో ఇవాళ ప్రేక్షకులకు కావల్సినంత స్టఫ్ దొరికేసింది. ఇవాళ నర్మదా అదేనండీ.. మన మొనాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది.

కరోనా రికవరీ రేటు పరంగా ఇండియా వరల్డ్ రికార్డ్..

ఇండియా కరోనా కేసుల సంగతి ఎలా ఉన్నా.. రికవరీ రేటు మాత్రం రికార్డ్ స్థాయిలో ఉండటం ఊరటను కలిగిస్తోంది.

మహిళా జర్నలిస్ట్‌పై మండిపడ్డ డైరెక్టర్ మారుతి..

మాతృత్వం ఓ గొప్ప వరం. అమ్మ అవడం అనేది ప్రతి మహిళకు మరో జన్మ.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న నిఖిల్‌..?

హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా 18 పేజీస్‌, కార్తికేయ‌2 చిత్రాలు రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.