ధన్ రాజ్ కు ఎక్కువైందా..వెటకారం..ఏమౌతుందో....

  • IndiaGlitz, [Wednesday,June 15 2016]

అప్పుడెప్పుడో జ‌గ‌డం అనే సినిమాతో క‌మెడియ‌న్ గా అవ‌తార‌మెత్తిన ధ‌న‌రాజ్ త‌న‌దైన శైలిలో సినిమాల‌తో అడ‌పాద‌డ‌పా న‌టిస్తూ ప‌ర్వాలేద‌నిపించుకుంటున్న త‌రుణంలో జ‌బ‌ర్‌ద‌స్త్ కామెడి ప్రోగాం ద్వారా విప‌రీత‌మైన ఫాలోయింగ్ సంపాదించుకుని త‌న పేరుకు ముందు ధ‌నాధ‌న్ చేర్చుకుని ధ‌నాధ‌న్ ధ‌న‌రాజ్‌గా క్ష రేంజ్ లో గుర్తింపు పొందిన సంగ‌తి అందరికీ తెలిసిందే. ఆ క్ర‌మంలో తాను నిర్మాతగా కూడా అవతారమెత్తాడు.

ఒక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ధ‌న‌రాజ్ న‌టిస్తున్న తాజా చిత్రం ప‌నిలేని పులిరాజు ట్రైల‌ర్ ఈ మ‌ధ్య‌నే సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. అదీ కూడా బాగానే ఉంది. కానీ ఆ ట్రైల‌ర్ అసాంతం ఆక‌ట్టుకునేలా ఉన్నా చివ‌ర‌లో వ‌చ్చే డైలాగ్ లో దిల్ రాజే పిలిచినా నేను రాను అని ధ‌న‌రాజ్ ప‌లికిన డైలాగ్ సినీ వ‌ర్గాల చ‌ర్చ‌కు దారి తీస్తుంది. ఎందుకంటే తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొత్తగా వ‌చ్చిన వారు కానీ, ప్ర‌స్తుతం ఉన్న న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఎవ‌రైనా కానీ దిల్ రాజు సంస్థ‌లో ప‌నిచేయాల‌నుకుంటూ ఉంటారు. అటువంటి దిల్‌రాజుని ఖాత‌రు చేయ‌కుండా ఆయ‌న్ని ధ‌న‌రాజ్ అవ‌మానించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని, ప‌నిలేని పులిరాజు చిత్రంలో ఆ స‌దరు డైలాగ్ ఏ విధంగా ఆలోచించి పెట్టారో తెలియ‌డం లేదు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఆగ్ర‌హానికి గురైతే మ‌న ప‌నిలేని పులిరాజు నిజంగానే ప‌నిలేని ధ‌న‌రాజుగా అవ‌డం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. ధ‌నరాజ్ అచితూచి అడుగేస్తే మంచిద‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More News

బాజీగర్ కాదంటున్ననాని..

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం జెంటిల్ మన్.

అఖిల్ తో ఆలోచనలో పడ్డ బాలయ్య.....

అక్కినేని వంశం మూడోతరంలో తెలుగు తెరకు పరిచయమైన మరో యువ కథానాయకుడు అఖిల్.సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.

ఫ‌స్ట్ ల‌వ్ లో ఉండే స్వ‌చ్ఛ‌మైన ఫీలింగ్సే మా గుప్పెడంత ప్రేమ - హీరోయిన్ అదితి సింగ్

ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ లో డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల తెర‌కెక్కించిన ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం గుప్పెడంత ప్రేమ.ఈ చిత్రం సెన్సార్ అయి, వెండితెర మీద‌కు రావ‌డానికి సిద్దమైంది.

సెల్ఫీ రాజా వచ్చేస్తున్నాడు...

అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం సెల్ఫీ రాజా.ఈ చిత్రాన్ని సిద్ధు ఫ్రమ్ సికాకుళం ఫేం జి.ఈశ్వర్ రెడ్డి తెరకెక్కించారు.

పవన్ కి విలన్ ఇతడే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది.