కొత్త పాలసీ వారికి మాత్రమే..: క్లారిటీ ఇచ్చిన వాట్సప్..

  • IndiaGlitz, [Friday,January 08 2021]

దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది. శుక్రవారం ఉదయం నుంచి వాట్సప్ ఓపెన్ చేయగానే కొత్త ప్రైవసీ రూల్స్ పాప్ అప్ మెసేజ్ ప్రతి వినియోగదారుడి ఫోన్‌లోనూ కనిపించింది. ఈ కొత్త ప్రైవసీ రూల్స్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మరాయి. ఆ రూల్స్‌ను యాక్సెప్ట్ చేస్తే మాత్రం మన ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉండటమే కాదు... ఆ విషయాలు తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేస్తే మాత్రం చిక్కుల్లో పడ్డట్టేనని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ కొత్త ప్రైవసీ రూల్స్‌లో మన డేటాను వాట్సప్ ఎలా ఉపయోగించుకోబోతుందో.. మన డేటాను ఫేస్‌బుక్‌కు ఎలా షేర్ చేసుకుంటుందో.. దీంతో పాటు మన వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్‌లో సవివరంగా ఉన్నాయి.

అయితే ఈ తలనొప్పంతా ఎందుకులే అని చాలా మంది వాట్సప్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ నుంచి వాట్సప్‌ను తొలగించేస్తున్నారు. దీంతో కొత్త పాలసీపై వాట్సప్ కీలక ప్రకటన చేసింది. వాట్సప్ వినియోగదారులందరి సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోబోమని.. బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేస్తామని వెల్లడించింది. అలాగే ఎవరి వ్యక్తిగత ఖాతాల వివరాలను వ్యాపార అవసరాల కోసం వినయోగించబోమని స్పష్టం చేసింది. దీంతో యూజర్స్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితికి తెరదించినట్టైంది. ఉదయం నుంచి కొత్త పాలసీ తమ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని ఆందోళన చెందిన వినియోగదారులు వాట్సప్‌కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.

ఈ క్రమంలోనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. వాట్సప్ కొత్త పాలసీపై స్పందిస్తూ.. వాట్సప్‌కి బదులు సిగ్నల్ యాప్‌ను వినియోగించాలని ట్వీట్ చేశారు. దీంతో సిగ్నల్ యాప్‌కి అనూహ్యంగా ఆదరణ పెరిగింది. దీంతో వాట్సప్ స్పందించక తప్పలేదు. నిజానికి కొద్ది రోజుల క్రితం వాట్సప్ కొత్త టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నేడు యూజర్స్ వాట్సప్ ఓపెన్ చేయగానే పాప్ అప్ విండో కనిపించింది. ఈ పాలసీని యూజర్స్ ఫిబ్రవరి 8 లోపు కచ్చితంగా అంగీకరించాలని స్పష్టం చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. చివరకు దీనిపై వాట్సప్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

More News

మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు?: భూమా మౌనిక

మాజీ మంత్రి అఖిల ప్రియ కిడ్నాప్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అఖిల ప్రియ సోదరి మౌనిక మీడియాతో మాట్లాడుతూ..

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ..

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్‌ను అందించింది. గృహ కొనుగోలు దారులకు సంక్రాంతికి ముందే పండుగ కానుకను అందించింది.

పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి..

కరోనా మహమ్మారి తన పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతోంది. 2019లో వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారిని ఆ దేశస్తులు త్వరగానే వదిలించుకున్నారు.

'మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది - డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌

దళపతి విజయ్‌ కథానాయకుడిగా నగరం, ఖైది చిత్రాలతో సెన్సేషల్‌ హిట్స్‌ సాధించిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో

వాట్సప్‌పై ఎందుకింత చర్చ? కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది?

దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది.