హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌

  • IndiaGlitz, [Tuesday,September 29 2020]

మన వాట్సాప్‌ను హ్యాక్ చేసి చాటింగ్ మొత్తం సైబర్ నేరగాళ్లు పరిశీలిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌ అవడం ఒక్కసారిగా కలకలం రేరపింది. చాలా తెలివిగా సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సాప్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. రెస్పాండ్ అయిత ఖేల్ ఖతమే. మన వాట్సాప్ మొత్తం వారి కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతుంది.

ఎమర్జెన్సీ హెల్ప్‌ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో సైబర్ నేరగాళ్లు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు. ఓటీపీ నంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఓటీపీ నంబర్‌ చెప్పగానే క్షణాల్లో వాట్సాప్‌ క్రాష్‌ అవుతుంది. బాధితుల్లో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నారు. వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను.. ఎవరికీ పంపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడ్‌ పంపితే వాట్సాప్‌ చాట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తున్నారని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో కోడ్‌ చెప్పొద్దని సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. వాట్సప్‌ హ్యాక్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.