'బాహుబలి-2' ఆడియో విడుదల ఎప్పుడంటే....

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా 'బాహుబ‌లి ది బిగినింగ్' రెండ‌వ పార్ట్ 'బాహుబ‌లి-2 క‌న్ క్లూజ‌న్' రెడీ అవుతుంది. ప్ర‌భాస్, అనుష్క‌, త‌మ‌న్నా, సత్యరాజ్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంది. ఇప్పుడంద‌రూ బాహుబ‌లి2 ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాడు. దీంతో తెలుగు సినిమా మార్కెట్‌ను ఇంకా విస్తృతం చేయ‌డానికి అవ‌కాశం ఉన‌ట్లే. కాగా ఈ సినిమా ఏప్రిల్ 28 2017న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రేపు బాహుబ‌లి-2కు సంబంధించిన కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. అలాగే ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఉగాది రోజున నిర్వ‌హిస్తార‌ని టాక్ విన‌పడుతుంది.

More News

బెజవాడ నేపథ్యంలో మరో సినిమా 'రణరంగం'

ఎమ్.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్ని ఖరారు చేశారు.

బాలయ్య సినిమా ముందు అతనితోనే...

నటసింహ నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే బాలకృష్ణ తన 101వ సినిమా చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలుగు ప్రేక్షకులంతా 'మెట్రో' చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా: గీతా మాధురి

ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా `మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా 'ఉంగరాల రాంబాబు' హీరో సునీల్ ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు.