బాహుబలి 2 రిలీజ్ ఎప్పుడు...?

  • IndiaGlitz, [Tuesday,October 06 2015]

ప్ర‌భాస్, రానా, అనుష్క‌..ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాహుబ‌లి చూసిన వారంద‌రూ బాహుబ‌లి 2 ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇదే విష‌యం గురించి రాజమౌళిని అడిగితే...బాహుబ‌లి 2 దాదాపు న‌ల‌భై శాతం షూటింగ్ పూర్త‌య్యింది. సెప్టెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం.

2016 స‌మ్మ‌ర్ లో బాహుబ‌లి 2 రిలీజ్ చేస్తామ‌న్నారు. అయితే సెప్టెంబ‌ర్ వెళ్ళ‌పోయి అక్టోబ‌ర్ వ‌చ్చింది. కానీ బాహుబ‌లి 2 షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రామోజీ ఫిలిం సిటీలో త్వ‌ర‌లోనే బాహుబ‌లి 2 షూటింగ్ ప్రారంభించి... 2016 న‌వంబ‌ర్ లో బాహుబ‌లి 2 రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి..జ‌క్క‌న్న 2016 న‌వంబ‌ర్ లో రిలీజ్ చేస్తాడో..లేక 2017 న‌వంబ‌ర్ లో రిలీజ్ చేస్తాడో చూడాలి.

More News

పిల్లలు కావాలంటున్న హన్షు

దేశముదురు పక్కన తెల్లటి బార్బీ బొమ్మలా కనిపించిన ఉత్తరాది చిన్నది హన్సిక. ఈ మధ్య కాలంలో తెలుగు కన్నా తమిళం మీదే ఎక్కువ దృష్టి పెట్టింది.

పాటల పల్లకిలో లచ్చిందేవి

లచ్చిందేవి బాగా కళకళలాడుతోంది. మొన్నామధ్య కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముహూర్తాన్ని ప్రారంభించుకున్న లచ్చిందేవి ఈ మధ్య గుమ్మడికాయ కొట్టి పూర్తి కానిచ్చేసింది షూటింగ్ ని

గోన గన్నారెడ్డి నిడివి ఎంత...?

అనుష్క ప్రధాన పాత్రలో గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి.3డి లో రూపొందిన రుద్రమదేవి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అన్ని ఎమోష‌న్స్ ఉన్న జెన్యూన్‌ హిస్టారికల్‌ మూవీ రుద్ర‌మ‌దేవి : అనుష్క‌

సూప‌ర్ చిత్రంతోతెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బెంగుళూరు భామ అనుష్క‌. అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి...ఇలా విభిన్న‌మైన చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుంది.

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు చిత్రం

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.