close
Choose your channels

Where is The Venkatalakshmi Review

Review by IndiaGlitz [ Friday, March 15, 2019 • తెలుగు ]
Where is The Venkatalakshmi Review
Banner:
ABT Creations Banner
Cast:
Laxmi Raai, Poojitha Ponnada, Karthik, Praveen, Madhu Nandan, Brahmaji, Jabardasth Mahesh, Gemini Naresh, D.V. Pankaj
Direction:
Kishore (Ladda)
Production:
M Sridhar Reddy, H Anand Reddy and RK Reddy
Music:
Hari Gowra

కాంచ‌న‌మాల కేబుల్ టీవీ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ ల‌క్ష్మీకి మంచి విజ‌యాలు ద‌క్క‌లేదు. దాంతో ఆమె త‌మిళ, క‌న్న‌డ సినిమా రంగాల వైపు మొగ్గు చూపింది. అడ‌పా ద‌డ‌పా తెలుగులో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టిస్తూ వ‌స్తుంది. గ్లామ‌ర్ డాల్‌గా పేరు తెచ్చుకున్న ఈమె.. టైటిల్ పాత్ర‌లో `వేర్ ఈజ్ ది వెంక‌టల‌క్ష్మీ` సినిమాను రూపొందించారు. మ‌రి ఈ సినిమాతో రాయ్‌ల‌క్ష్మికి ఎలాంటి పేరు వ‌చ్చింది. సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర మెప్పించింది? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం..

క‌థ‌:

పండు(మ‌ధునంద‌న్‌), చంటి(ప్ర‌వీణ్‌) ఊళ్లో అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ.. వెధ‌వ ప‌నులు చేస్తూ అంద‌రినీ ఆట ప‌ట్టిస్తూ.. ఏడిపిస్తూ ఆనందిస్తుంటారు. వీరు ఉండే ఊల్లోకి వెంక‌ట‌ల‌క్ష్మి( రాయ్ ల‌క్ష్మి) టీచర్‌గా వ‌స్తుంది. ఆమె అందానికి ఫిదా అయిన పండు, చంటి ఆమెను ప్ర‌స‌న్నం  చేసుకోవ‌డానికి నానా పాట్లు ప‌డుతుంటారు. అయితే వారికి వెంక‌ట‌ల‌క్ష్మి మ‌నిషి కాదు.. దెయ్యం అని తెలుస్తుంది. త‌ను చేయ‌మ‌న్న ప‌ని చేయ‌క‌పోతే చంపేస్తాన‌ని వెంక‌ట‌ల‌క్ష్మి ఇద్ద‌రినీ బెదిరిస్తుంది. అస‌లు ఆమె వాళ్ల‌కి చెప్పే ప‌నేంటి?  వెంక‌ట‌ల‌క్ష్మి ఎవ‌రు?  శేఖ‌ర్‌, గౌరి ఎవ‌రు?  వీళ్ల‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి?  చివ‌ర‌కు వెంక‌ట‌లక్ష్మి ఏం సాధించాల‌నుకుంటుంది అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:

క‌థ‌లో కీల‌కంగా ఉండే ప్ర‌ధాన పాత్ర‌లు రాయ్ ల‌క్ష్మి, మ‌ధు నంద‌న్‌, ప్ర‌వీణ్‌ల‌పైనే ప్ర‌థ‌మార్థం అంతా సాగుతుంది. వీరు చేసే అల్ల‌రి చిల్ల‌ర ప‌నులే ప్ర‌ధానంగా ఫ‌స్టాఫ్ అంతా సాగ‌దీశారు. ప్రాత‌ల‌ను, వాటి ఆధారంగా చేసిన స‌న్నివేశాల‌ను బ‌లంగా తీర్చిదిద్ద‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. ఇది ఓ ర‌కంగా ప్రేక్ష‌కుల స‌హనానికి ప‌రీక్ష పెట్టేలా ఉంది. ఇక ఇంటర్వెల్ ముందు రాయ్‌ల‌క్ష్మి పాత్ర‌ను ఎంట్రీ చేయ‌డంతో గ్లామ‌ర్ డోస్‌కు డైరెక్ట‌ర్స్ డోర్స్ తెరిచాడు. అయితే రాయ్ ల‌క్ష్మిని గ్లామ‌ర్ కోసం వాడుకోవాలి. కానీ పాత్ర‌లో పెర్ఫామెన్స్ ప‌రంగా డెప్త్ ఉండేలా కూడా చూసుకోవాలి క‌దా.. అలా లేకుండా పోవ‌డం మైన‌స్ అవుతుంది. రొటీన్ స‌న్నివేశాల‌తో, సాగ‌దీసిన‌ట్లు క‌థ‌ను అటు, ఇటు తిప్పి రొటీన్ క్లైమాక్స్‌తో మ‌మ అనిపించాడు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింద‌నేలా సినిమా ఉండ‌టంతో పాటు ప్రేక్ష‌కుడి స‌హనానికి ప‌రీక్ష పెట్టేలా ఉంది. ద్శ‌కుడు కిషోర్ కుమార్ సినిమాలో క‌థ‌, క‌థ‌నం, స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రాయ్ ల‌క్ష్మి ఈ సినిమాకు ముందు నుండి ప్ర‌ధాన ప్ల‌స్ అవుతుంద‌నుకున్నారు. ఆమె గ్లామ‌ర్‌నే ప్ర‌ధానంగా వాడుకోవాల‌ని కూడా చూశారు. అయితే పాత్ర‌ను దీని వ‌ల్ల ఎఫెక్టివ్‌గా లేకుండా పోయింది. చివ‌ర‌కు రాయ్ లక్ష్మి పాత్ర అందాలు ఆర‌బోయ‌డం త‌ప్ప ఎందుకు లేదులే అనేలా క‌న‌ప‌డుతుంది. రామ్ కార్తీక్‌, పూజిత పొన్నాడ రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి న‌టించారు. మ‌ధునంద‌న్‌, ప్ర‌వీణ్ పాత్ర‌ల‌ను కామెడీ ప‌రంగా బాగా ఎలివేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్యూర్ ప‌క్కాగా తెలుస్తుంది. నాటు కామెడీ విసుగు తెప్పిస్తుంది. పంక‌జ్ కేస‌రి విల‌నిజంస‌రిగ్గా పండ‌లేదు. వెంక‌ట్ శాఖ‌మూరి కెమెరా ప‌నితం కొన్ని సీన్స్‌లో బావున్నాయి. ఓ రొమాంటిక్ సాంగ్ బావుంది. ఇక రాయ్ లక్ష్మి ఐటెమ్ సాంగ్ రొటీన్‌గా ఉంది. ద‌ర్శ‌కుడు కిషోర్ సినిమా క‌థ‌, క‌థ‌నంపై ఫోకస్ పెట్టి ఉంటే బావుండేది.

చివ‌ర‌గా.. బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాలు లేవు.. పాత్ర‌లు, స‌న్నివేశాలు తేలిపోయాయి.. మొత్తంగా వెంక‌ట లక్ష్మీ థియేట‌ర్స్‌లో వేర్ ఈజ్ అనుకోవాలేమో.

Read Where is The Venkatalakshmi Review in English Version

Rating: 2 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE