బ్రూస్ లీ ఆడియో వేదిక ఎక్కడ...?

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. బ్రూస్ లీ ఆడియో వేడుక‌ను ఎక్క‌డ నిర్వ‌హించాల‌నే విష‌యం పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోని చిత్ర‌యూనిట్ తాజాగా హైటెక్స్ గ్రౌండ్స్ ని బ్రూస్ లీ ఆడియో వేదికగా ఫిక్స్ చేసింది.

అక్టోబ‌ర్ 2న ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం చాలా గ్రాండ్ గా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.నేటితో చిరు పై చిత్రీక‌రించే సీన్స్ పూర్త‌వుతాయి. మిగిలివున్న చ‌ర‌ణ్ సీన్స్ ను రేప‌టి నుంచి షూట్ చేయ‌నున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన బ్రూస్ లీ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. అభిమానులు ఎప్పుడెప్పుడు చిరు, చ‌ర‌ణ్ ల‌ను తెర‌పై చూస్తామా..అని ఎదురుచూస్తున్నారు. బ్రూస్ లీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ర‌జ‌నీ క‌బ‌లి టైటిల్ మారుతుందా..?

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బ‌లి. ఈచిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది.

పవన్ ఫ్యాన్స్ పై వర్మ కామెంట్స్...

వివాదానికి..సంచలనానికి..మరో పేరు ఏమిటంటే...అందరు ఠక్కున చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎప్పుడూ..ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు.

చీకటి రాజ్యంలో నటించిన రైటర్స్...?

కమల్ హాసన్ హీరోగా రాజేష్.ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చీకటిరాజ్యం.విభిన్నంగా ఒకేరోజు జరిగే కథతో ఈ సినిమా రూపొందుతుంది.

విలక్షణ పాత్రలో నయనతార

పెర్ ఫారెన్స్ రోల్స్ తో పాటు, గ్లామర్ రోల్స్ లో కూడా అలరిస్తున్న నయనతార రీసెంట్ గా ‘మయూరి’ చిత్రంలో మంచి సక్సెస్ ను అందుకుంది.

నానికి ఇద్దరు

‘అష్టాచమ్మా’..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా నాని హీరోగా పరిచయమైయ్యాడు.