Download App

ఏ ద‌ర్శ‌కుడు హిట్ ఇస్తాడో?

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ప‌రుశురాం దిట్ట. ఆయ‌న డైరెక్ట్ చేసిన `గీత‌గోవిందం` సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. పెద్ద‌చిత్రాల‌కు ధీటుగా సినిమా పోటీ ప‌డుతుంది. క‌మిట్‌మెంట్ ప్ర‌కారం బుజ్జి తన నెక్ట్స్ సినిమా కూడా గీతాఆర్ట్స్‌లోనే చేయ‌బోతున్నాడు. ఇందులో హీరోగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తాడ‌ని స‌మాచారం. సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస‌గా ఆరు ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఎంతైనా మెగా కాంపౌండ్ హీరో కాబ‌ట్టి అత‌నికి హిట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుని.. అత‌నితోనే సినిమా చేయ‌డానికి రెడీ అయ్యింద‌ట నిర్మాణ సంస్థ‌. ఇప్పుడు కిషోర్ తిరుమ‌ల సినిమాతో పాటు ప‌రుశురాం సినిమా చేయ‌బోతున్నాడు. ఇద్ద‌రిలో సాయిధ‌ర‌మ్‌కి స‌క్సెస్ ఇచ్చేదెవ‌రో చూడాలి.