Budget 2023 : పసిడి మరింత ప్రియం.. సెల్‌ఫోన్లు చవక.. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి

  • IndiaGlitz, [Wednesday,February 01 2023]

2023- 24 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనగానే సామాన్యులు వేటిపై ధరలు పెంచుతారు.. వేటిపై తగ్గిస్తారు అనే విషయంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఎప్పటిలాగే ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా.. మరికొన్నింటిపై పన్ను భారం వేసింది. మరి దీని ఆధారంగా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏవి తగ్గుతాయో చూస్తే:

ధరలు పెరిగేవి:

బంగారం, వెండి ప్లాటినంతో తయారు చేసే వస్తువులు
సిగరెట్లు, టైర్లు
దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
రాగి వస్తువులు

ధరలు తగ్గేవి :

మొబైల్స్, ల్యాప్‌టాప్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు
టీవీ ప్యానెల్ విడి భాగాలు
లిథియం అయాన్ బ్యాటరీలు
ఎలక్ట్రిక్ వాహనాలు
వజ్రాల తయారీకి ఉపయోగించే వస్తువులు
డీఎస్ఎల్ఎర్ కెమెరా లెన్స్‌లు

More News

Union Budget 2023 : వేతన జీవులకు ఊరట, మహిళల కోసం కొత్త స్కీమ్.. కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలివే

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Taraka Ratna:తారకరత్నను బాలయ్య మృత్యుంజయ మంత్రమే రక్షిస్తోంది.. ఇదొక మిరాకిల్ : నిర్మాత వ్యాఖ్యలు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించి రకరకాల ఊహాగానాలు మీడియాలో,

Deccan Mall : దక్కన్ మాల్ కూల్చివేత.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం, తప్పిన పెను ప్రమాదం

సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేటలోని దక్కన్ మాల్‌లో ఇటీవల భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

YS Jagan : విశాఖే రాజధాని.. త్వరలో నేనూ అక్కడికే షిఫ్ట్ అవుతున్నా : సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై తొలి నుంచి స్పష్టతతో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. వీలైనంత త్వరగా విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని తొలి నుంచి చెబుతున్నారు.

Tahsildar: అర్థరాత్రి డిప్యూటీ కలెక్టర్ గది తలుపుకొట్టిన డిప్యూటీ తహసీల్దార్ .. ఉలిక్కిపడ్డ మహిళా అధికారిణీ

ఇటీవల తెలంగాణ సీఎంవో కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో