close
Choose your channels

ఆగస్ట్ 15న ఈ 3 సినిమాల్లో ఏది చూస్తారు!?

Tuesday, June 18, 2019 • తెలుగు Comments

ఆగస్ట్ 15న ఈ 3 సినిమాల్లో ఏది చూస్తారు!?

సినిమా విడుద‌ల‌కి ముందే దుబాయ్‌లో ప్రివ్యూలు చూసి ఇటు సౌత్, అటు నార్త్ సినిమాలపై నెగెటివ్ రివ్యూలు రాస్తూ కమల్ ఆర్‌ ఖాన్ బాగా పాపులర్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తూ.. విమర్శల వర్షం కురిపించడంలోనూ.. ప్రశంసించడంలోనూ కమల్ ముందు వరుసలో ఉంటాడు. కాగా ఆగస్ట్-15న మూడు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘మిషన్‌మంగల్’, ‘బాట్లా హౌస్’, ‘సాహో’ ఈ మూడు చిత్రాల్లో ఏ మూవీ చూస్తారని ట్విట్టర్ వేదికగా.. కమల్ ఓ పోల్ పెట్టాడు.

కాగా.. ‘సాహో’ సినిమానే చూస్తానని 63% మంది ఓటేయగా.. తర్వాతి స్థానంలో 17% ‘మిషన్‌మంగల్’, 12% ‘బాట్లా హౌస్’ 8% మీ రివ్యూపైనే ఆధారపడి ఉంటుంది.

మిషన్‌మంగల్ : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ, విద్యాబాలన్, సోనాక్షిసిన్హా, నిత్యమీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ‘మిషన్ మంగల్’ సినిమా కథ తనదేనని అమెరికాకు చెందిన సినీ నిర్మాత రాధా భరద్వాజ్ కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. మిషన్ మంగల్ కథను యూఎస్ కాపీరైట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నట్లు రాధా భరద్వాజ్ చెప్పారు. 2016లో రాధా భరద్వాజ్ ఈ కథతో చిత్ర నిర్మాత అతుల్ కస్బేకర్‌ని సంప్రదించారని, వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగినట్లు రాధా భరద్వాజ్ తరపు న్యాయవాది శ్రీస్ఠి ఓఝా తెలిపారు.

బాట్లా హౌస్: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో గతంలో జరిగిన ఒక వివాదాస్పద ఎన్‌కౌంటర్ ఆధారంగా రూపొందిస్తున్నారు. నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సాహో మోగా బడ్జెట్ ఫిల్మ్. దీనికి సుజిత్ డైరెక్టర్. ఈ మూడు సినిమాలపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాహో:  ‘బాహుబలి 2’ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఈ అంచనాలకు తగ్గట్టుగానే.. షేడ్స్ ఆఫ్ షాడో, చాప్టర్స్ 1, చాప్టర్ 2, ఫస్ట్ లుక్, యాక్షన్ సీక్వెన్సులతో మూవీ మేకర్స్ క్రేజ్ పెంచేశారు. కాగా.. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించేలా.. రియలస్టిక్‌ అవుడ్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో హై వోల్టేజ్ రప్పించారు. బాహుబలిని మెప్పించిన ప్రభాస్ సాహోను ఎంతవరకూ తీసుకెళ్తాడో వేచి చూడాల్సిందే.

కాగా ఈ మూడు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. అయితే ఏ మూవీ సూపర్ డూపర్ హిట్టవుతుందో.. క్రిటిక్స్ ఏ మాత్రం రివ్యూ ఇస్తారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz