ఆగస్ట్ 15న ఈ 3 సినిమాల్లో ఏది చూస్తారు!?

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

సినిమా విడుద‌ల‌కి ముందే దుబాయ్‌లో ప్రివ్యూలు చూసి ఇటు సౌత్, అటు నార్త్ సినిమాలపై నెగెటివ్ రివ్యూలు రాస్తూ కమల్ ఆర్‌ ఖాన్ బాగా పాపులర్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తూ.. విమర్శల వర్షం కురిపించడంలోనూ.. ప్రశంసించడంలోనూ కమల్ ముందు వరుసలో ఉంటాడు. కాగా ఆగస్ట్-15న మూడు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘మిషన్‌మంగల్’, ‘బాట్లా హౌస్’, ‘సాహో’ ఈ మూడు చిత్రాల్లో ఏ మూవీ చూస్తారని ట్విట్టర్ వేదికగా.. కమల్ ఓ పోల్ పెట్టాడు.

కాగా.. ‘సాహో’ సినిమానే చూస్తానని 63% మంది ఓటేయగా.. తర్వాతి స్థానంలో 17% ‘మిషన్‌మంగల్’, 12% ‘బాట్లా హౌస్’ 8% మీ రివ్యూపైనే ఆధారపడి ఉంటుంది.

మిషన్‌మంగల్ : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ, విద్యాబాలన్, సోనాక్షిసిన్హా, నిత్యమీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ‘మిషన్ మంగల్’ సినిమా కథ తనదేనని అమెరికాకు చెందిన సినీ నిర్మాత రాధా భరద్వాజ్ కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. మిషన్ మంగల్ కథను యూఎస్ కాపీరైట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నట్లు రాధా భరద్వాజ్ చెప్పారు. 2016లో రాధా భరద్వాజ్ ఈ కథతో చిత్ర నిర్మాత అతుల్ కస్బేకర్‌ని సంప్రదించారని, వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగినట్లు రాధా భరద్వాజ్ తరపు న్యాయవాది శ్రీస్ఠి ఓఝా తెలిపారు.

బాట్లా హౌస్: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో గతంలో జరిగిన ఒక వివాదాస్పద ఎన్‌కౌంటర్ ఆధారంగా రూపొందిస్తున్నారు. నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సాహో మోగా బడ్జెట్ ఫిల్మ్. దీనికి సుజిత్ డైరెక్టర్. ఈ మూడు సినిమాలపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాహో: ‘బాహుబలి 2’ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఈ అంచనాలకు తగ్గట్టుగానే.. షేడ్స్ ఆఫ్ షాడో, చాప్టర్స్ 1, చాప్టర్ 2, ఫస్ట్ లుక్, యాక్షన్ సీక్వెన్సులతో మూవీ మేకర్స్ క్రేజ్ పెంచేశారు. కాగా.. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించేలా.. రియలస్టిక్‌ అవుడ్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో హై వోల్టేజ్ రప్పించారు. బాహుబలిని మెప్పించిన ప్రభాస్ సాహోను ఎంతవరకూ తీసుకెళ్తాడో వేచి చూడాల్సిందే.

కాగా ఈ మూడు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. అయితే ఏ మూవీ సూపర్ డూపర్ హిట్టవుతుందో.. క్రిటిక్స్ ఏ మాత్రం రివ్యూ ఇస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

రెజీనా పెళ్లి కబురు

టాలీవుడ్లోగానీ, కోలీవుడ్‌లోగానీ రెజీనా పెళ్లి గురించి వ‌చ్చిన‌న్ని వార్త‌లు మ‌రే హీరోయిన్‌కూ వ‌చ్చి ఉండ‌వేమో.

రాజ్ త‌రుణ్ ని స‌మ్మోహ‌న‌ప‌ర‌చ‌నుందా?

టాలీవుడ్‌లో స‌క్సెస్ అర్జంటుగా కావాల్సిన హీరోల్లో రాజ్ త‌రుణ్ ఒక్క‌డు.

'మ‌న్మ‌థుడు2' అంతా సాఫీ.. నో వ‌ర్రీస్‌

నాగార్జున న‌టిస్తున్న `మ‌న్మ‌థుడు2` ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న‌ప్ప‌టి నుంచీ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో ఉంటూనే ఉంది.

టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది - మెగాస్టార్ చిరంజీవి

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

'ప‌లాస 1978' ఫ‌స్ట్ లుక్ లాంచ్

ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది.