close
Choose your channels

బన్నీ చిత్రంలో మరదలు?

Wednesday, August 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బన్నీ చిత్రంలో మరదలు?

అల్లు అర్జున్ చిత్రంలో అతని మరదలు నిహారిక నటించనుందా? అంటే అవుననే సమాధానం ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినపడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణలో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే తన 20వ సినిమా చిత్రీకరణలో బన్నీ పాల్గొనబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట.

ఆ పాత్రకు నిహారిక అయితే సూట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించి ఆమెను సంప్రదిస్తే ఆమె కూడా నటించడానికి ఓకే అన్నారని టాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. `ఆర్య`, `ఆర్య 2` చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. `రంగస్థలం` తర్వాత సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.