బాలీవుడ్ ‘ఛ‌త్ర‌ప‌తి’ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తున్న‌దెవ‌రంటే?

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘అల్లుడు శీను’ సినిమాతో ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌.. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. వినాయ‌క్‌కు కూడా ఇదే బాలీవుడ్ డెబ్యూ మూవీ. ద‌ర్శ‌కధీరుడు తెర‌కెక్కించిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను వినాయ‌క్ ఎలా ప్రెజంట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై జ‌యంతి లాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు తెలుగులో ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో భానుప్రియ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హిందీలో ఈ పాత్ర‌ను ఢిల్లీ క్రైమ్ ఫేమ్‌ షెఫాలీ షా పోషించ‌నున్నార‌ట‌. మ‌ద‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధాన పాయింట్‌గా స‌ముద్ర తీర ప్రాంతంలో దందా చేసే ఓ మాఫియా చేతిలో చిక్కుకున్న యువ‌కుడు డాన్ రేంజ్‌కు ఎలా ఎదిగాడు.. ఆ క్ర‌మంలో దూర‌మైన త‌న త‌ల్లి ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకున్నాడ‌నే క‌థాంశ‌మే ఇది. ఈ సినిమాను వినాయ‌క్ ఎలా తెర‌కెక్కిస్తాడ‌నేది అంద‌రిలో తెలియ‌ని ఓ ఆస‌క్తిని రేపుతోంది.

More News

మహేశ్ సినిమాలో పవన్..?

కొన్ని కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ గురించి విన్న‌ప్పుడు జ‌రుగుతుందో లేదో కానీ.. జ‌రిగితే బావుండు‌న‌ని అంద‌రూ అనుకుంటారు.

సెన్సేష‌న‌ల్ పాత్ర‌లో అంజ‌లి..?

ఫొటో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు, డిక్టేటర్, గీతాంజలి సహా పలు తెలుగు చిత్రాలతో

మ‌రోసారి అలాంటి టైటిల్‌తో మెగాస్టార్..!

వీలైనంత త్వ‌ర‌గా ఆచార్య సినిమాను పూర్తి చేసి లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించాల‌ని చిరంజీవి భావిస్తున్నాడ‌ట‌.

బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో సినిమా.. ఓకే అంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో డైరెక్ట‌ర్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఓ సినిమాను చేయాల‌ని అనుకున్నాడు.

కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలైంది.. టీపీసీసీ అధ్యక్షుడిగా...

ఒకప్పుడు తెలంగాణను ఏలిన పార్టీ.. ఇప్పుడు పూర్తిగా వరుస ఎదురు దెబ్బలతో అల్లాడుతోంది. వరుస వైఫల్యాలు ఈ పార్టీ నేతల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి.