ఇద్ద‌రిలో ప‌వ‌న్‌తో చేసెదెవ‌రు?

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ హీరోయిన్‌ను తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావించింది.

ముఖ్యంగా శృతిహాస‌న్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కాగా.. తాజాగా ఈ రేసులో మ‌రో హీరోయిన్ కూడా వ‌చ్చి చేరింది ఆమె ఇలియానా. వీరిద్ద‌రూ ప‌వ‌న్‌తో ఇది వ‌ర‌కు సినిమాలు చేసిన వారే. ప‌వ‌న్‌తో ‘జ‌ల్సా’ సినిమాలో ఇలియానా న‌టిస్తే .. ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌’, ‘కాట‌మ‌రాయుడు’ చిత్రాల్లో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రి వీరిద్ద‌రిలో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎవ‌రి వైపుకు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

రీసెంట్‌గా విడులైన వ‌కీల్ సాబ్ ఫ‌స్ట్ లుక్‌, ‘మ‌గువా మ‌గువా..’ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రో ప‌క్క ప‌వ‌న్ త‌న 27వ సినిమా షూటింగ్‌ను క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేసేశాడ‌ని స‌మాచారం.