close
Choose your channels

'83' లో గ‌వాస్క‌ర్ పాత్ర‌ధారి ఎవ‌రంటే?

Thursday, February 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

1983లో క‌పిల్‌దేవ్ నాయ‌క‌త్వంలో ఇంగ్లాండ్‌లో జ‌రిగిన క్రికెట్ ప్ర‌పంచ క‌ప్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ విజ‌య‌యాత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌బోతున్నారు. `83` అనే టైటిల్‌తో సినిమా రూపొంద‌నుంది. కాగా.. ఈ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్ క‌పిల్ దేవ్ పాత్ర‌లో న‌టిస్తుంటే.. అప్ప‌టి టీం ఓపెన‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ పాత్ర‌లో త‌హీర్ రాజ్ బాసిన్ న‌టిస్తున్నార‌ని యూనిట్ ప్ర‌క‌టించింది.

అలాగే అప్పటి టీమిండియా మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి.. క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌.. శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా.. సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌.. బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్‌ నటిస్తున్నారు. ఇప్ప‌టికే సగం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యిందని స‌మాచారం. 2020లో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.