close
Choose your channels

'ఒంటేరు' కారెక్కడాన్ని అడ్డుకుంటున్నదెవరు!?

Friday, January 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఒంటేరు’ కారెక్కడాన్ని అడ్డుకుంటున్నదెవరు!?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బద్ధ శత్రువు అయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్‌‌కు టాటా చెప్పేసి కారెక్కాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఒంటేరు గులాబీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులుండరనే విషయం మరోసారి ఒంటేరు రూపంలో నిరూపితమైందన్న మాట. ఒకప్పుడు వీరిద్దరూ ఒకరిపై మరొకరు మాటల కత్తులు దూసుకునేవాళ్లు. అంతేకాదు కేసీఆర్‌‌పై ఒక్క ఒంటేరు తప్ప మరెవ్వరూ పోటీ చేయలేరనే రేంజ్‌‌ ఉండేది.!.

గత పదేళ్లుగా కేసీఆర్‌తో పోరాడి పోరాడి అలసిపోయారేమో గానీ.. ఆఖరికి ఆయన చెంతకే వెళ్లాలనుకున్నారు ఒంటేరు. అయితే ఆయన రాకను టీఆర్‌‌ఎస్‌‌లో కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆయన్ను ఎలా తీసుకుంటారు? ఆయన పార్టీ మారతారని చెప్పినంత మాత్రాన మీరెలా తీసుకుంటారు..? అసలు మీరేం చేస్తున్నారో అర్థం అవుతోందా..? అంటూ ఒకరిద్దరు సీనియర్లు అధిష్టానం తీరును తప్పుబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే శత్రువును సైతం మిత్రుడిగా చేస్కోని మన గూటికి తెచ్చుకోవడం మనం చేసిన తప్పవుతుందా..? లేకుంటే మన విజయవుతుందా..? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రగతి భవన్‌‌నుంచి పార్టీ నేతలకు విషయం చేరవేసినట్లు తెలిసింది. దీంతో ఎవరైతే ఆయన రాకను అడ్డుకోవాలని యత్నించారో వాళ్లే తప్పని పరిస్థితుల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మరీ ముఖ్యంగా ఒంటేరు చేరికతో కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో గులాబీ సేనకు ఎదురే ఉండదని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒంటేరు వస్తానన్నా చేర్చుకోం..!
ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరికను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కావాలనే ఒంటేరు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని కొత్త ఆరోపించారు. ఆయన పార్టీలో చేరుతున్నట్లు మా పార్టీ అధిష్టానంకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒకవేళ ఆయనే టీఆర్ఎస్‌లోకి వస్తానన్నా.. పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా లేదని ‘కొత్త’ ట్విస్ట్ ఇచ్చారు. గులాబీ గూటికి చేరాలని ఒంటేరును తమ పార్టీలో ఎవరూ సంప్రదించలేదని కొత్త ప్రభాకర్ రెడ్డి కుండ బద్ధలు కొట్టారు. అయితే ఇంతవరకూ పార్టీలో చేరుతున్నట్లుగానీ.. కాంగ్రెస్‌‌లో కొనసాగుతానని కానీ ఒంటేరు ఒక్కమాట చెప్పకపోవడంతో మౌనానికి అర్థం అంగీకారమేనని స్పష్టంగా అర్థం చేస్కోవచ్చు.

అడ్డుకునేది వీళ్లేనా..!
మరీ ముఖ్యంగా గజ్వేల్‌‌కు చెందిన ఓ ఇద్దరు టీఆర్ఎస్ కీలకనేతలు ఆయన రాకను అడ్డుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఆయనగానీ పార్టీలోకి వస్తే గజ్వేల్ మొత్తం ఒంటేరు చేతిలోకే వెళ్తుందని.. దీంతో భవిష్యత్తులో మనకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని భావించి అస్సలు ఆయన్ను చేర్చుకునేందుకు వీళ్లేదని అధిష్టానాన్ని గట్టిగా పట్టుబట్టారట. అయితే రాజకీయ సమీకరణలు దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందరూ ఆయన రాకను స్వాగతించాల్సిందేనని గులాబీ బాస్ చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే తన బద్ధ శత్రువు, తనపైనే పోటీచేసిన వ్యక్తిని తానే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం అనేది ఆషామాషీ విషయమేం కాదు. అందుకే కేసీఆర్‌‌ రాజకీయ చాణక్యుడు అంటారేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.