close
Choose your channels

మోదీ మెచ్చిన ఈ బుడ్డోడు ఎవరబ్బా!?

Tuesday, July 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మోదీ మెచ్చిన ఈ బుడ్డోడు ఎవరబ్బా!?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ బిజిబిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో మీటింగ్‌లు, విదేశీ పర్యటనలు ఇలా నిత్యం బిజీగా ఉండే మోదీ తాజాగా ఓ బుడ్డోడితో ఆడుకున్నారు. బుడ్డోడిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని సరదాగా ఆటాడించారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదండోయ్ పార్లమెంట్‌లో. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరబ్బా..? అని అందరూ చర్చించుకుంటున్నారు.

‘ఆటాడుకుందాం రా’ బుడ్డోడా!!

మంగళవారం నాడు పార్లమెంట్‌లో ఈ ‘ఆటాడుకుందాం రా’ అనే ఆసక్తికర సంఘటన జరిగింది. బుడ్డోడితో ఆటాడిన తర్వాత ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ బుడ్డోడు ‘స్పెషల్ ఫ్రెండ్‌’ అని మోదీ చెప్పుకొచ్చారు. చిన్నారితో మోదీ సరదాగా గడుపుతున్న ఈ ఫొటోలు బీజేపీ నేతలు, కార్యకర్తలు, నెటిజన్ల మదిని దోచుకున్నాయి. కేవలం రెండు గంటల్లోనే ఈ పోస్ట్‌కు 14 లక్షల మందికిపైగా లైక్‌లు కొట్టడం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫొటోలు చూసి దేశం మొత్తం ఫిదా అవుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరబ్బా..!?

అన్నీ సరే మోదీ సాబ్.. జర ఈ బుడ్డోడు ఎవరో చెప్పండి అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. మోదీతోనే ఆడుకున్న ఈ బుడ్డోడు ఎవరై ఉంటారు..? అనే విషయం తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరేమో క్రికెటర్ రోహిత్ శర్మ కూతురని.. మరికొందరు అమిత్ షా మనవరాలని.. ఇంకొందరు ఉజ్జయినీ ఎంపీ సత్యనారాయణ జఠియా మనవడని కామెంట్లలో చెబుతున్నారు. మొత్తమ్మీద ఇంతకీ ఈ చిన్నారి బుడ్డోడా...? బుడ్డదా..? అనే విషయం కూడా తెలియదు. ఫైనల్‌గా ఎవరనేది తెలుస్తుందో లేదో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.