ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

  • IndiaGlitz, [Saturday,September 19 2020]

బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వారం ఆసక్తికరంగానే నడిచింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ టీం కుమార్ సాయిని నిర్వాహకులు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకూ ఆయన ఏమాత్రం తన ఆట తీరునైతే కనబరచలేదు. ఇప్పటి వరకూ హైలైట్ అయ్యిందైతే లేదు. ఆ తరువాత వచ్చిన అవినాష్ మాత్రం.. అదరగొట్టేస్తున్నాడు. వచ్చిన వెంటనే అందరితో కలిసి పోయాడు. దీంతో కంటెస్టెంట్లు కూడా అవినాష్‌ని ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా కాకుండా తమతో ట్రావెల్ చేస్తున్న ఓ కంటెస్టెంట్‌గా మాత్రమే చూశారు.

మొదటి వారం పెద్దగా ఒకరిద్దరు తప్ప ఎవరూ హైలైట్ అవ్వలేదు. కానీ రెండో వారం దాదాపు ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ని బయట పడుతూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతూ వస్తున్నారు. ఇక ఎలిమినేషన్ సమయం రానే వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్ అనేది ముగిసింది. ఈ సారి ఎలిమినేషన్‌లో గంగవ్వ, అభిజిత్, అమ్మ రాజశేఖర్, నోయెల్, మొనాల్, దేత్తడి హారిక, కరాటే కల్యాణి, సొహైల్, కుమార్ సాయి ఉన్నారు. అయితే ఈ సారి విశేషం ఏమిటంటే.. ఓటింగ్ విషయంలో ఒకరితో మరొకరికి తీవ్ర స్థాయిలో పోటీ జరిగినట్టు తెలుస్తోంది.

గత వారంతో పోలిస్తే ఈ వారం గంగవ్వ అంతగా ఓటింగ్‌ను ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. దాదాపు ఆమెతో సమానంగా అభిజిత్ ఓట్లను పొందడం విశేషం. దీంతో వీరిద్దరికీ వచ్చిన ఇబ్బందైతే ఏమీ లేదు. సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. మూడో ప్లేస్‌లో నోయెల్, సొహైల్‌కు పోటాపోటీగా ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో దేత్తడి హారిక, మొనాల్‌లు ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా పోటా పోటీ ఓటింగ్ జరిగనట్టు సమాచారం. వీరిద్దరూ సేఫ్‌ జోన్‌లోనే ఉన్నారు.

ఇక ఆ తరువాతి స్థానంలో కుమార్ సాయి ఉన్నాడు. కాబట్టి కుమార్ సాయికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఇక మిగిలింది.. అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణి. వీరిద్దరి మధ్యే ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో ఇమడలేకపోతోంది కాబట్టి బిగ్‌బాస్ ఆమెను పంపించేయాలని భావిస్తే చెప్పలేము. లేదంటే మాత్రం అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణిలలో ఒకరి ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది. అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కరాటే కల్యాణికే ఉన్నట్టు తెలుస్తోంది.

More News

విశాఖలో టీడీపీకి షాక్.. పార్టీని వీడనున్న మరో ఎమ్మెల్యే..

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

దేవి ఫైర్.. బిగ్‌బాస్ వచ్చి సారీ చెప్పాలన్న నోయెల్

బిగ్‌బాస్ హౌస్‌లోకి అవినాష్ ఎంట్రీ ఇచ్చాక మంచి జోష్ వచ్చింది. అందిరితో బాగా కలిసిపోయి మొదటి రోజే రాక్ చేశాడు.

గంగవ్వకు బిగ్‌బాస్ హౌస్‌లో కరోనా పరీక్ష..!

బిగ్‌బాస్ సీజన్ 4లో మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది గంగవ్వే.

దీపావళికి విశాల్‌.. ఓటీటీలోనే..!

హీరో, నిర్మాత విశాల్‌ లేటెస్ట్ మూవీ చక్ర. దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'చక్ర' సినిమాను విడుదల చేయడానికి విశాల్‌ సన్నాహాలు చేసుకున్నారు.

ఎట్టకేలకు 'నిశ్శబ్దం' విడుదలపై అధికారిక ప్రకటన

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేటెస్ట్‌ మూవీ 'నిశ్శబ్దం' రిలీజ్‌కు సంబంధించి లేటెస్ట్‌ అధికారిక ప్రకటన వెలువడింది.