close
Choose your channels

‘జబర్దస్త్‌ షో’కు రోజా గుడ్ బై.. జడ్జ్‌గా ఎవరొస్తారో!?

Wednesday, July 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘జబర్దస్త్‌ షో’కు రోజా గుడ్ బై.. జడ్జ్‌గా ఎవరొస్తారో!?

‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షోకు నగరి ఎమ్మెల్యే రోజా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే సదరు యాజమాన్యానికి ఈ విషయం చెప్పగా.. ఓకే అని మరో పర్మినెంట్ జడ్జ్‌కోసం వెతికే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అసలు రోజా ఎందుకు ఈ షోను వదిలేయాలని అనుకున్నారు..? సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

‘రోజా అనే నేను...’ అదృష్టం లేకపోయినా!

చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండోసారి గెలిచి నిలిచిన ఎమ్మెల్యే రోజా.. అటు రాజకీయాలు.. ఇటు కామెడీ షో రెండూ చేస్తూ కాలం గడిపేస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రోజాకు మరిన్ని బాధ్యతలు పెరిగాయి. పైగా మంత్రి పదవి కూడా దక్కుతుందని జగన్ కేబినెట్‌లో ఈమె కూడా ‘రోజా అనే నేను...’ అని గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేస్తారని వీరాభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు అందరూ భావించారు. ఆ అదృష్టం లేకపోయినప్పటికీ.. ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ) చైర్‌పర్సన్‌గా మాత్రం ఇటీవలే బాధ్యతలు కూడా స్వీకరించారు.

బాధ్యతలు పెరిగాయ్.. ఇక గుడ్ బై!

ఇప్పుడు అటు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు.. ఇటు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు రోజాకు ఎక్కువయ్యాయి. దీంతో ఇక రోజాకు టైమ్ అస్సలుండదు. పైగా ఫస్ట్ టైమ్‌ నామినెటెడ్ పోస్ట్.. అందులో చాలెంజింగ్ పదవి కూడా. దీంతో ఈ టెన్షన్‌లే ఎక్కువ ఉంటాయ్ గనుక ఇక కతర్నాక్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్నారట. అంతేకాదు.. కామెడీ షోలను పక్కనెట్టి కాన్‌సన్ట్రేషన్‌ మొత్తం పదవిపైనే పెట్టాలని రోజా ఫిక్స్ అయ్యారట.

రోజా స్థానంలో ఎవరు..!?

రోజా ఈ షోకు గుడ్ బై చెప్పేస్తే ఈమె స్థానంలో ఎవరుంటారు..? ఎవర్ని తీసుకుంటారా..? ఈ షోకు ఎవరైతే న్యాయం చేయగలరా..? అని సదరు యాజమాన్యం సెర్చింగ్‌లో ఉందట. ముఖ్యంగా ఇప్పటికే ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన మీనా, సంఘవి ఇప్పటికే ఓ సారి షోకు ఫెర్ఫామెన్స్ చూపించి వెళ్లారు. వీరిద్దరిలోనే ఎవరో ఒకర్ని ఫైనల్‌ చేసి అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువరించనున్నారని సమాచారం. కాగా సంఘవి అయితే బెటర్‌గా ఉంటుందని యాజమాన్యం భావిస్తున్నట్లు టాక్. రోజా ఏ ఎపిసోడ్‌తో గుడ్ బై చెప్పేస్తారో..? ఫైనల్‌గా ఎవర్ని లేడీ జడ్జ్‌గా తీసుకుంటారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.