గూబ గుయ్ మ‌న్న‌ది ఎవ‌రికి..?

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...టాక్ తో సంబంధం లేకుండా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఇదిలా ఉంటే...జ‌న‌తా గ్యారేజ్ విజ‌యోత్స‌వంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడిన మాట‌లు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంత‌కీ క‌ళ్యాణ్ రామ్ ఏమ‌న్నారంటే...త‌మ్ముడు (ఎన్టీఆర్),నేను మూడు సంవ‌త్స‌రాల నుంచి కొట్టాలి కొట్టాలి అని వెయిట్ చేస్తున్నాం. ఆఖ‌రికి ఈ సినిమాతో గూబ గుయ్ మ‌నేలా కొట్టాం. ఈ సినిమాతో మా నంద‌మూరి ఫ్యాన్స్ ఆక‌లి తీరింది. మా త‌మ్ముడు ఆక‌లి తీరింది అంటూ ఎమోష‌నల్ గా మాట్లాడాడు క‌ళ్యాణ్ రామ్.

అయితే...తాజాగా చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం జ‌న‌తా గ్యారేజ్ దాదాపు 75 కోట్లు షేర్ సాధించింది అంటున్నారు. ఈ సినిమా బాహుబ‌లిని క్రాస్ చేయ‌లేదు. శ్రీమంతుడుని క్రాస్ చేయ‌లేదు. మ‌రి...క‌ళ్యాణ్ రామ్ అంత‌లా ఎమోష‌న్ అవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..? అంటూ క‌ళ్యాణ్ రామ్ మాట‌ల గురించి ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే... ఇంత‌కీ గూబ గుయ్ మ‌న్న‌ది ఎవ‌రికి..? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గుతుంది. క‌ళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కి ఉత్సాహం క‌లిగించేలా ఏదో మాట్లాడాలి అని అలా మాట్లాడారా..? లేక మాట‌ల వెన‌క ఇంకేదైనా ఉందా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి...ఆ మాట‌ల వెన‌క మ‌ర్మం క‌ళ్యాణ్ రామ్ కే తెలియాలి.

More News

అఖిల్‌కు హీరోయిన్ దొరికేసింది...?

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన అఖిల్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. దాంతో ఓ ర‌కంగా నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీ డిస్ట్ర‌బ్ అయ్యారు.

ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..!

రేణుదేశాయ్...ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను పంచుకునే రేణుదేశాయ్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రి ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ అవుతున్నారు

మిలియ‌నీర్ అయిన నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో ముందుకెళుతున్నాడు క‌దా..ఉంటే గింటే త‌ను కోటీశ్వ‌రుడై ఉండాలి. అలాంటిది త‌ను మిలియ‌నీర్ ఎలా అయ్యాడ‌నుకుంటున్నారా.

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంలో రోహిత్ హీరో కాడా....?

నారా రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విభిన్న చిత్రాల క‌థానాయ‌కుడు నారా రోహిత్, ప్రేమ ఇష్క్ కాద‌ల్ చిత్రంలో రాయ‌ల్‌రాజు పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన శ్రీవిష్ణు క‌థానాయ‌కులుగా నిర్మించ‌బ‌డుతున్న చిత్రం `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`.

మా అబ్బాయి రోష‌న్ నాకంటే మంచి స్ధాయికి వెళ‌తాడు అనేది నా న‌మ్మ‌కం - శ్రీకాంత్

శ్రీకాంత్ - ఊహ‌ల ముద్దుల త‌న‌యుడు రోష‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.