హన్సిక అలా అనేసిందేంటబ్బా...

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

పదహారేళ్ళకే హీరోయిన్‌గా నటించింది. హీరోతో కలిసి స్టెప్పులేసింది. ఆమె హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఇప్పటికి పదేళ్ళు పూర్తయ్యాయి. ఆమె గ్లామర్‌ ప్రపంచానికే పరిమితం కాదు. అనాథలకు ఆపన్న హస్తం అందిస్తుంది. పెళ్ళి కాకుండానే 31 మంది పిల్లలకు తల్లయింది. అమ్మ చెప్పిన మాటలు ఆదర్శంగా తీసుకుంది. అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారిని తల్లిలా చేయూత నిస్తోంది. ఆమె పేరు హన్సిక. తెలుగులో 'దేశముదురు' చిత్రంతో తెరంగేట్రం చేసిన హన్సికకు ఈమధ్య తెలుగులో అవకాశాలు తగ్గాయి.
తమిళ ఇండస్ట్రీపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఎక్కువగా యంగ్‌ హీరోలతోనే సినిమాలు చేసిన హన్సికను స్టార్‌ హీరోలతో నటించే ఉద్దేశం లేదా? అని అడిగిన ప్రశ్నకు 'నా దృష్టిలో అందరూ ఒక్కటే. చిన్నవారు, పెద్ద వారు అనే తేడా నాకు లేదు. ఎవరైనా చిన్న స్థాయి నుంచి పైకి రావాల్సిందే తప్ప ఒక్కసారిగా స్టార్‌ హోదా రాదు. అయినా ఈ హోదా, నంబర్లపైన నాకు నమ్మకం లేదు. సక్సెస్‌లు వున్నంత వరకు నంబర్లు కనిపిస్తాయి. ఒక్క ఫ్లాప్‌ వచ్చిందంటే ఆ నంబర్ల స్థానంలో నక్షత్రాలు కనిపిస్తాయి. నాకు నా కెరీర్‌ ముఖ్యం తప్ప ఫలానా వయసు వాళ్ళతోనే నటించాలని గిరి గీసుకోలేదు. నాకు కథ నచ్చితే ఏ హీరోతో నటించడానికైనా సిద్ధమే అంటోంది హన్సిక మోత్వాని.

More News

లావణ్య కోరిక తీర్చేదెవ్వరో..

'అందాల రాక్షసి' తో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠికి నటిగా మంచి పేరు వచ్చింది.

బోయపాటి స్టైల్ మారిందా..

యాక్షన్ సినిమాలు చేయడంలో దిట్ట బోయపాటి శ్రీను.

జులై 21న విడుదలకానున్న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

ఆ పది మంది డ్రగ్స్ మత్తును వీడి బయటకు రావాలని కోరుకుంటున్నాం : నిర్మాత అల్లు అరవింద్

'టాలీవుడ్ ఇండస్ర్టీలో కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది.

మలయాళ రంగంలోకి శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్

ఏమైంది ఈవేళ,అధినేత,బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్