చంద్రబాబుకు ఎందుకంత భయం.. ఇంకా తేరుకోలేదు!

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేనట్లేనని తెలుస్తోంది. అయితే మరోవైపు అధికార పార్టీ నేతలు, మంత్రులు సూటిపోటి మాటలతో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ కీలక నేత, వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటన పార్టీ తరపున చేశారని.. పార్టీ వాగ్దానానికి, ప్రభుత్వ వాగ్దానానికి తేడా తెలియదా? అని ప్రశ్నించారు. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ఐదేళ్లలో రూ.11,400 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పుకొచ్చారు. మిగతా రుణాలు ఈ ప్రభుత్వం మాఫీ చేయాలనడం అవివేకమన్నారు.

అధికారపక్షంపై ఆరోపణలు చేయడం మానుకుని... ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమీ లేవని.. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సమీక్షిస్తామని ఎన్నికల సమయంలోనే జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఘోరపరాభవం నుంచి చంద్రబాబు ఇంకా తేరుకోలేదని.. ఏకపక్షంగా ఏ ప్రాజెక్టును నిలిపివేయలేదన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులేవీ లేవని.
తప్పులు జరగనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తొలి కేబినెట్ సమావేశం గొప్పగా జరిగిందని... మంత్రులు, అధికారులను సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

More News

వైఎస్ జగన్‌ను కలిసిన నిఖిల్.. రాజకీయాల్లో చర్చ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ గౌడ క‌లిశారు.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రివెంజ్ ఉంటుందా!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

ఏపీ సెక్రటేరియట్‌‌కు కత్తి మహేశ్ ఎందుకెళ్లినట్లు!?

టాలీవుడ్‌లో వివాదాలకు మారుపేరుగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఉన్నట్టుండి ఏపీ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యాడు.

రోజా, అంబటి, ఆళ్లకు త్వరలో కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవులు ఆశించి.. చివరి నిమిషం వరకు పక్కా అనుకుని దక్కించుకోలేకపోయిన వారిలో రోజా, అంబటి రాంబాబు

జూన్ 28న విడుద‌ల‌వుతున్న‌ శ్రీవిష్ణు, నివేథా థామ‌స్ 'బ్రోచేవారెవ‌రురా'

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది.