close
Choose your channels

ఇంత చేసిన కేసీఆర్‌ యుద్ధభేరికి ఎందుకు వెళ్లలేదు!?

Saturday, January 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంత చేసిన కేసీఆర్‌ యుద్ధభేరికి ఎందుకు వెళ్లలేదు!?

గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది కిందటి నుంచే ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ అని పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో వరుసగా భేటీలు జరిపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌తో కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ ఫ్రంట్‌పై కీలక చర్చలు జరిపారు. త్వరలోనే మరికొందరు ప్రముఖులతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ, కాంగ్రెస్‌లకు బద్ధశత్రువుగా మారిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పీఎం పీఠంపై కూర్చోవడానికి తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు కాకుండా ఏ పార్టీ వచ్చి తనను సంప్రదించినా సరే రైట్ రైట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ తరుణంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి దేశం నలుమూలల నుంచి పలు పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం తన బృందంతో కలిసి కోల్‌కతాలో యుద్ధభేరిలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ యుద్ధభేరిని పట్టించుకోలేదు.. ఈ ర్యాలీకి వెళ్లడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు..?అసలు ఆయన ఎందుకు ర్యాలీకి వెళ్లట్లేదు..? ఇన్ని రోజులూ ఫ్రంట్ అని చర్చలు, కీలక భేటీలు జరిపిన కేసీఆర్‌‌ ఎందుకు సైలెంట్ అయ్యారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.

కారణాలివేనా..!
అయితే.. ఈ ర్యాలీకి చంద్రబాబు వెళ్తున్నందునే కేసిఆర్ వెళ్లడం లేదన్నది కొందరి వాదన. ఇప్పటికే ఇద్దరు చంద్రుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి. మరీ ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్ అంటూ ఇద్దరూ తెలుగు రాజకీయాలను రక్తి కట్టి్స్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరూ ఒకే చోటికెళితే బాగోదని కేసీఆర్ మిన్నకుండిపోయారని టాక్. కాగా.. కాంగ్రెస్, బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏ ప్రంట్‌తో చేయి కలిసే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కేసీఆర్ మాత్రం తన వంతుగా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఇతర పార్టీలతో విస్తృత స్థాయిలో చర్చలకు తేదీలు ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది. చిన్న పార్టీలను కలుపుకుపోతే తమకు పెద్దన్న పాత్ర ఖాయమని టీఆర్ఎస్ ఆలోచన కావచ్చొని విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా బీజేపీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి తక్కువ స్థానాలు వస్తే మూడో శక్తిగా చక్రం తిప్పే వీలుంటుందనే కేసీఆర్ నమ్మకం పెట్టుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి..? తెలుగు రాష్ట్రాల తరఫున ఢిల్లీలో ఎవరు చక్రం తిప్పబోతున్నారు..? అనే విషయాలు తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.